Memu coPulam: జీ5లో మరో క్రేజీ సిరీస్.. నాగబాబు ‘మేము కాప్‌లం’ త్వరలోనే స్ట్రీమింగ్
నాగబాబు 'మేము కాప్‌లం(Memu coPulam)' త్వరలోనే స్ట్రీమింగ్.
nagababu Meme KaPulam Web Series streaming on zee5
- నాగబాబు ప్రధాన పాత్రలో ‘మేము కాప్‌లం’.
- గోదావరి నేపథ్యంలో కామెడీ మిస్టరీ.
- త్వరలోనే జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభం.
Memu coPulam: ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 వేదికగా త్వరలోనే ‘మేము కాప్‌లం(Memu coPulam)’ అనే సరికొత్త వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ను ప్రదీప్ మద్దాలి తెరకెక్కించగా, బి.వి.ఎస్. రవి మరియు కౌముది నిర్మించారు. గోదావరి జిల్లాల గ్రామీణ నేపథ్యంలో, సంక్రాంతి పండుగ సమయంలో జరిగే ఒక విచిత్రమైన కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కామెడీ మరియు మిస్టరీ కలయికతో సాగే ఈ సిరీస్‌లో గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల కీలక పాత్రలు పోషించారు.
Anna Lezhneva: రాష్ట్రపతిని కలవడం మర్చిపోలేను.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన పవన్ భార్య అన్నా లెజ్నేవా
విచారణకు వచ్చే ఇద్దరు పోలీసుల తొందరపాటు, వారు సేకరించే ఆధారాలు గ్రామంలో ఎలాంటి గందరగోళానికి దారితీశాయనేది ఇందులో వినోదాత్మకంగా చూపించారు. ‘పరువు’ సిరీస్ తర్వాత నాగబాబు మరోసారి జీ5తో కలిసి పనిచేయడం విశేషం. హాస్యంతో పాటు స్థానిక రాజకీయాలు, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించేలా ఈ సిరీస్ రూపొందింది. విలక్షణమైన కథనం, ఆసక్తికరమైన మలుపులతో అలరించే ‘మేము కాప్‌లం’ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

