Nagarjuna : మొన్న తోసేశారు.. ఇవ్వాళ దగ్గరికి తీసుకున్నారు.. నాగార్జున వీడియో వైరల్..

ఇటీవల నాగార్జున ఎయిర్ పోర్ట్ లో నుంచి వస్తుంటే పక్కన ఉన్న బాడీ గార్డ్ మానసిక వైకల్యంతో ఉన్న ఓ పెద్దాయనని తోసేసిన ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Nagarjuna : మొన్న తోసేశారు.. ఇవ్వాళ దగ్గరికి తీసుకున్నారు.. నాగార్జున వీడియో వైరల్..

Nagarjuna Meets a Physically Challenged Person in Airport who recently thrown by his Bodyguards

Nagarjuna : ఇటీవల నాగార్జున ఎయిర్ పోర్ట్ లో నుంచి వస్తుంటే పక్కన ఉన్న బాడీ గార్డ్ మానసిక వైకల్యంతో ఉన్న ఓ పెద్దాయనని తోసేసిన ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే. నాగార్జున ఎయిర్ పోర్ట్ నుంచి వస్తుండగా అక్కడ పనిచేసే వ్యక్తి నాగార్జునతో మాట్లాడటానికి వచ్చాడు. దీంతో నాగార్జున పక్కనున్న బాడీగార్డ్ అతన్ని పక్కకు తోసేసాడు. ఆ వ్యక్తి పడిపోబోవడంతో అక్కడే పనిచేస్తున్న వేరే వ్యక్తులు పట్టుకున్నారు. ఈ సంఘటనను నాగార్జున గమనించలేదు.

కానీ ఈ ఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగార్జునపై, బాడీ గార్డ్స్ పై విమర్శలు వచ్చాయి. అయితే దీనికి నాగార్జున స్పందించి.. ఇది నా దృష్టికి వచ్చింది. ఇలా జరిగి ఉండకూడదు. నేను ఆ పెద్దాయనకు క్షమాపణలు చెప్తున్నాను. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటాను అని ట్వీట్ చేశారు.

Also Read : AVS : ఈ నటీనటులు ఇద్దరూ కమెడియన్ AVS కూతురు, అల్లుడు అని తెలుసా..? వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు..

తాజాగా నాగార్జున ఎయిర్ పోర్ట్ కి వెళ్లగా ఆ మానసిక వైకల్యం ఉన్న వ్యక్తిని దగ్గరికి పిలిపించి కలిసి మాట్లాడారు. నాగార్జున పిలిచి మాట్లాడటంతో ఆ వ్యక్తి సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే మొన్నేమో అలా తోసేసి ఇప్పుడు పిలిచి మాట్లాడుతున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, కొంతమంది మొన్న తెలియక జరిగిన తప్పుకు ఇప్పుడు ఇలా నాగార్జున పిలిచి మాట్లాడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.