Naila Grrewal : అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ.. ఈమె ఎవరో తెలుసా?

తాజాగా ఓ పంజాబీ భామ రాకా సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది. (Naila Grrewal)

  • Published on- July 14, 2026 / 11:10 AM IST

Naila Grrewal

Naila Grrewal : అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ రాకా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సైంటిఫిక్ యాక్షన్ సినిమాగా రాకా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రాకా సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుందని అధికారికంగానే ప్రకటించారు.

అయితే రాకా సినిమాలో ఆల్మోస్ట్ అయిదుగురు హీరోయిన్స్ ఉంటారని వార్తలు వచ్చాయి. ఇందులో మృణాల్, జాన్వీ, రష్మిక పలువురు బాలీవుడ్ భామల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇటీవల ఓ మలయాళీ హీరోయిన్ ఫెమినా జార్జ్ తాను కూడా అల్లు అర్జున్ రాకా సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగానే ప్రకటించింది. తాజాగా ఓ పంజాబీ భామ రాకా సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది.

Also Read : Kavitha : రేవంత్ సీఎం అయ్యాడని.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీద కోపంగా ఉందన్న కవిత..

పంజాబీ ఫ్యామిలీకి చెందిన నైలా గ్రేవల్ ఢిల్లీలో సెటిల్ అయింది. బాలీవుడ్ లో తమాషా సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బరిల్లి కి బర్ఫీ, తప్పడ్, ఇష్క్ విష్క్ బౌండ్.. సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఓ నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో కూడా నటించింది.

తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నైలా గ్రేవల్ మాట్లాడుతూ.. నేను రాకా సినిమాలో నటిస్తున్నాను. అట్లీ దర్శకత్వంలో ఎప్పట్నుంచో పనిచేయాలి అనుకున్నాను. నాకు ఆ అవకాశం వచ్చింది. కేవలం బాలీవుడ్ సినిమాల్లో పనిచేసిన నన్ను తీసుకోవడం సంతోషంగా ఉంది అని తెలిపింది. దీంతో రాకా సినిమాలో ఓ నైలా గ్రేవల్ కీలక పాత్రలో కనిపించబోతుంది తెలుస్తుంది.