దిశ ఎన్‌కౌంటర్ : భగవంతుడే పోలీసుల రూపంలో శిక్షించాడు – బాలయ్య

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన నందమూరి బాలకృష్ణ.. ప్రభుత్వానికి, పోలీసులకు కృతజ్ఞతలు..

  • Publish Date - December 6, 2019 / 07:47 AM IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన నందమూరి బాలకృష్ణ.. ప్రభుత్వానికి, పోలీసులకు కృతజ్ఞతలు..

దిశ నిందితులను శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సినీ నటులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా బాలకృష్ణ, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ‘భగవంతుడే పోలీసుల రూపంలో దిశ నిందితులకు సరైన శిక్ష విధించాడు, మరొకసారి ఎవరూ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా, అసలు అటువంటి ఆలోచనే మొలకెత్తనివ్వకుండా అందరికీ ఇదొక గుణపాఠం కావాలి.. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరింది’ అని బాలకృష్ణ తెలిపారు.

Read Also : నువ్వొక మాటంటే అది శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. NBK 106 ప్రారంభం..

‘పొల్యూషన్ నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ పోలీసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. అందుకు ఇవాళ్టి ఎన్‌కౌంటరే ఉదాహరణ’ అని బోయపాటి శ్రీను తెలిపారు.