సంక్రాంతికి ‘ఎంత మంచివాడవురా’
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. 'ఎంత మంచివాడవురా'.. 2020 సంక్రాంతికి విడుదల..
- sekhar
- Published on- September 21, 2019 / 06:08 AM IST
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’.. 2020 సంక్రాంతికి విడుదల..
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’.. ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది.
శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో, ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘ఎంత మంచివాడవురా’ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చెయ్యనున్నట్టు ప్రకటిస్తూ.. న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు.
Read Also : నమ్మవీట్టు పిళ్లై – సెప్టెంబర్ 27న విడుదల
కళ్యాణ్ రామ్‌కిది 17వ సినిమా.. మెహరీన్ కళ్యాణ్ రామ్‌తో నటించడం ఇదే తొలిసారి. సంగీతం : గోపి సుందర్, కెమెరా : రాజ్ తోట, ఎడిటింగ్ : తమ్మిరాజు.
