Nani : ‘ది ప్యారడైజ్’ సినిమాకు ట్రైలర్ లేదు.. ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన నాని..
గత కొన్ని రోజులుగా ది ప్యారడైజ్ సినిమాకు ట్రైలర్ ఉండదు. డైరెక్ట్ సినిమానే అని వార్తలు వస్తున్నాయి. (Nani)
Nani
Nani : నాని ఫుల్ యాక్షన్ తో తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఫైనల్ గా సెప్టెంబర్ 24 రాబోతుంది. తాజాగా మొదటిసారి ది ప్యారడైజ్ సినిమా యూనిట్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మూవీ యూనిట్.
గత కొన్ని రోజులుగా ది ప్యారడైజ్ సినిమాకు ట్రైలర్ ఉండదు. డైరెక్ట్ సినిమానే అని వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రశ్నించగా నాని స్పందిస్తూ.. అవును నిజమే. ఈ సినిమాకు ట్రైలర్ ఉండదు. ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకొని నేను ట్రైలర్ ఇవ్వకుండా ఉండట్లేదు. ఇప్పుడు అందరూ సినిమాని రిలీజ్ డేట్ కి ఇవ్వాలని బిజీగా పని చేస్తున్నారు. ఇలాంటి టైంలో ట్రైలర్ ఇవ్వాలి అంటే ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కంటెంట్ ని మించి ఇవ్వాలి. అలా ఇవ్వడానికి కనీసం 4 రోజులు పనిచేయాలి. సినిమానే ఇంపార్టెంట్ కాబట్టి ట్రైలర్ వదిలేశాం. అందుకే ఈ సినిమాకు ట్రైలర్ లేదు అని అన్నారు. దీంతో ట్రైలర్ లేకపోతే ఎలా అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
Also Read : Srikanth Odela : ‘ది ప్యారడైజ్’ కథ చెప్పేసిన శ్రీకాంత్ ఓదెల.. పుట్టుక మనది, చావు మనది, బతుకంతా దేశానిది..
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా దీనిపై స్పందిస్తూ.. ఇలాంటి సినిమాకు ట్రైలర్ లేకపోతేనే మంచిది అని నా అభిప్రాయం. ట్రైలర్ లేకుండానే సినిమాకు వస్తే ఆ హైప్ ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన కంటెంట్ వచ్చిన హైప్ చాలు అన్నారు.
