Nani : కేరళ ఫ్యాన్ కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాని..

సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Nani : కేరళ ఫ్యాన్ కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాని..

Nani kept his promise for Kerala fan says in Saripodaa Sanivaaram Success Event

Nani : నాని సరిపోదా శనివారం సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ కొట్టాడు. ఇప్పటికే ఈ సినిమా 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో నిన్న సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Nani : ఈ బామ్మ గుర్తుందా..? బామ్మని స్టేజి పైకి పిలిచి మరీ ఫోటో ఇచ్చిన నాని..

నాని మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే టెన్షన్ ఉంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కేరళకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యాన్ ఇవాళ నేను వేసుకున్న ఈ బ్లాక్ షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ షర్ట్ ఇచ్చి అన్న సక్సెస్ ఈవెంట్ లో ఈ షార్ట్ వేసుకో అని చెప్పాడు. అప్పుడు పక్కన ఎవరో మర్చిపోతారు అప్పటికి అని అన్నారు. కానీ నేను అతనికి మాట ఇచ్చాను. కచ్చితంగా సక్సెస్ ఈవెంట్లో ఈ షర్ట్ వేసుకుంటాను అని. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది. సినిమా సక్సెస్ అయిందనే రిలీఫ్ కంటే కూడా ఈవెంట్ కి ఈ బ్లాక్ షర్ట్ వేసుకొని ఆ ఆఫ్యాన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అనే రిలీఫ్ ఎక్కువ ఉంది అని తెలిపారు. దీంతో నాని పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.