Nara Brahmani : నాన్నకు శస్త్రచికిత్స పూర్తయింది.. బాలయ్య ఆరోగ్యంపై బ్రాహ్మణి అప్డేట్..
తాజాగా బాలకృష్ణ కూతురు, నారా బ్రాహ్మణి తండ్రి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. (Nara Brahmani)
Nara Brahmani
Nara Brahmani : ఇటీవల సినిమా షూటింగ్ లో బాలకృష్ణ ఓ యాక్షన్ సన్నివేశం చేస్తుండగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. బాలకృష్ణ మోకాలికి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందని, నెలరోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు. దీంతో అభిమానులు, పలువురు సెలబ్రిటీలు బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
తాజాగా బాలకృష్ణ కూతురు, నారా బ్రాహ్మణి తండ్రి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. తన సోషల్ మీడియాలో.. నాన్న శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైంది. ఆయన ప్రస్తుతానికి తన పాత ఉత్సాహాన్ని తిరిగి పొందారు. త్వరలోనే మళ్లీ తన పనుల్లోకి వస్తారు. ఆయనపై మీరు చూపిన అపారమైన ప్రేమకు, ప్రార్థనలకు చాలా ధన్యవాదాలు. మీ అందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాము అని తెలిపారు.
Also Read : Dhruv Vikram : విక్రమ్ కొడుకుపై ఫిర్యాదు.. కోటి రూపాయలు తీసుకొని సినిమా చేయకుండా..
దీంతో బాలకృష్ణ ఆపరేషన్ పూర్తయిందని తెలుస్తుంది. ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని సమాచారం. అనంతరం నెల రోజులు రెస్ట్ తీసుకుంటారని తెలుస్తుంది. బాలయ్యకు ఇలా ఆపరేషన్ జరగాల్సి రావడంతో NBK 111 సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.
