Nara Rohith : మొదటిసారి హారర్ సినిమా చేస్తున్న నారా రోహిత్.. కొత్త సినిమా అనౌన్స్..
నేడు నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. (Nara Rohith)
Nara Rohith
Nara Rohith : ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన నారా రోహిత్ మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని ఇటీవల మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రతినిధి 2, భైరవం, సుందరకాండ.. సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు నారా రోహిత్. ఇటీవలే నారా రోహిత్ తండ్రి కూడా అయ్యారు.
నేడు నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. అయితే ఈసారి హారర్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ‘కపాలి’ అనే టైటిల్ తో ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేస్తూ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు నారా రోహిత్. రామ్ గన్ని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నారా రోహిత్ తన కెరీర్లో మొదటి సారి హారర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

