Drugs case Bollywood : నవదీప్ స్ట్రాంగ్ కౌంటర్..

  • Publish Date - September 13, 2020 / 03:04 PM IST

Navdeep Shocking Counter on Netizen: బాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణలో భాగంగా రియా చక్రవర్తి దాదాపు 25మంది సినీ ప్రముఖుల పేర్లు చెప్పిందని తెలియగానే సెలబ్రిటీల్లో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బైటకొచ్చినప్పట్నుంచీ కలకలం రేగుతోంది..
మరోవైపు తెలుగు ఇండస్ట్రీలోనూ గతంలో డ్రగ్స్ విషయం ఎంతపెద్ద సంచలనం కలిగించిందో తెలిసిందే..


ఇప్పుడు తిరిగి బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లింక్ బైటపడటం హాట్ టాపిక్‌గా మారింది.. రియా, రకుల్ ప్రీత్ సింగ్ పేరు బైటపెట్టడంతో.. ఇక టాలీవుడ్‌లోనూ ఈ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి… తాజాగా గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్‌కు ఓ నెటిజన్ వేసిన ప్రశ్నవేయగా నవదీప్ అతనికి అదిరిపోయే కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


సదరు నెటిజన్ నవదీప్, రకుల్‌తో పాటు మరో ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు పేర్కొంటూ.. ‘‘టాలీవుడ్ మళ్లీ యూటర్న్ తీసుకొంది.. అన్నా మనకీ బాధలు తప్పేలాలేవు’’.. అంటూ వెటకారంగా నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. దీనికి నవదీప్ ‘‘నాకేం బాధలేదు బ్రదర్.. నువ్వు కూడా ఏ బాధపడకు.. పద, పనికొచ్చే పనులు చేసుకుందాం’’.. అంటూ ఘాటు రిప్లైతో నోరుమూయించాడు.


ట్రెండింగ్ వార్తలు