Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి నిజంగా ‘జాతిరత్నం’.. తన సాయంతో సమీర్‌కు ఉద్యోగం..
బాధితులతో వీడియో కాల్స్‌లో మాట్లాడి.. వాళ్లకు ధైర్యం చెబుతూ, తనను సంప్రదిస్తున్న వారికి సహాయం అందిస్తున్నారు నవీన్ పొలిశెట్టి..
- sekhar
- Published on- August 3, 2021 / 04:50 PM IST
Naveen Polishetty
Naveen Polishetty: పాండమిక్ టైమ్‌లో తనకు వీలైనంత హెల్ప్ చేస్తున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. బాధితులతో వీడియో కాల్స్‌లో మాట్లాడి.. వాళ్లకు ధైర్యం చెబుతూ, తనను సంప్రదిస్తున్న వారికి సహాయం అందిస్తున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే యువకుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తన దృష్టికి రాగానే నవీన్ పోలిశెట్టి ఆ యువకుడి వివరాలతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందించిన ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ సమీర్‌కు స్టోర్ మేనేజర్‌గా ఉద్యోగాన్ని కల్పించింది.
సమీర్‌కు ఈ వోక్ – వేగాన్ స్టోర్ అండ్ కేఫ్ పంపిన ఆఫర్ లెటర్‌ను పోస్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి తన నోటీస్‌కు సమీర్ విషయాన్ని తీసుకొచ్చిన నెటిజన్స్ చరణ్, సౌమ్యలకు థ్యాంక్స్ చెప్పారు. త్వరలో ఈ స్టోర్‌కు తాను వెళ్తానని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. అలాగే పాండమిక్ టైమ్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వీలైనంత మందికి తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చొరవ తీసుకుందామంటూ ట్వీట్ చేశారు.
Anushka – Naveen Polishetty : టైటిల్ అదిరిపోయిందిగా..!
సెకండ్ వేవ్‌కి ముందు ‘జాతిరత్నాలు’ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి, ఇప్పటివరకు తర్వాతి సినిమా అనౌన్స్ చెయ్యలేదు. అయితే ఈ యంగ్ హీరో, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి నటించనున్నాడని తెలుస్తోంది.. 40 ఏళ్ల మహిళకు 25 సంవత్సరాల కుర్రాడికీ మధ్య జరిగే ప్రేమకథగా తెరకెక్కబోయే ఈ సినిమాని ‘రారా.. కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ దర్శకత్వంలో, సూపర్ హిట్ అండ్ ఫీల్ గుడ్ మూవీస్ అందించిన యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మించనుందని వార్తలు వస్తున్నాయి.
