Nayanthara : రాజకీయాల్లోకి నయనతార.. స్పందించిన భర్త విగ్నేష్ శివన్..
పలువురు తమిళ నటీనటులు రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. (Nayanthara)
- Saketh U
- Published on- October 13, 2026 / 08:48 PM IST
Nayanthara
Nayanthara : తమిళనాడు రాజకీయాల ప్రస్తావన వస్తే సినిమా వాళ్ళ ప్రస్తావన రావాల్సిందే. MGR నుంచి రీసెంట్ తమిళనాడు సీఎం విజయ్ వరకు ఎంతోమంది తమిళ నటీనటులు అక్కడ రాజకీయాల్లో చక్రం తిప్పారు, పార్టీలు పెట్టారు. అయితే ఇటీవల విజయ్ ఎన్నికలకు రెండేళ్ల ముందు పార్టీ పెట్టి ఒక సంవత్సరం ముందు ప్రజల్లో తిరిగి అనూహ్యంగా సీఎం అయిన సంగతి తెలిసిందే. విజయ్ సీఎం అవ్వడంతో మిగతా నటీనటులకు కూడా పాలిటిక్స్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే రాఘవ లారెన్స్, త్రిష, విశాల్, శివ కార్తికేయన్, ధనుష్.. ఇలా పలువురు తమిళ నటీనటులు రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి.
శివ కార్తికేయన్, ధనుష్ అయితే పొలిటికల్ పార్టీ పెడతారనే వార్తలు వస్తున్నాయి తమిళ మీడియాలో. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార పాలిటిక్స్ లోకి వస్తుందనే వార్తలు వచ్చాయి. ఆమెకు ఉన్న ఫ్యాన్ డమ్, క్రేజ్ కి పాలిటిక్స్ లో ఎంతో కొంత సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది. నయనతార పాలిటిక్స్ లోకి వస్తుంది అనే వార్తలు రావడంతో ఆమె భర్త విగ్నేష్ శివన్ దీనిపై స్పందించాడు.
Also Read : Jailer 2 : జైలర్ 2 తెలుగు ప్రమోషన్స్ లేనట్టేనా.. నిరాశలో టాలీవుడ్ ప్రేక్షకులు..
విగ్నేష్ శివన్ మాట్లాడుతూ.. నయనతారకు ప్రస్తుతం అలాంటి ప్లాన్స్ ఏమి లేవు. ప్రస్తుతం నయన్ తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ పిల్లలకు సమయం ఇస్తూనే కెరీర్లో సినిమాలు చేస్తూ సంతోషంగా ఉంది అని అన్నారు. అయితే ఈ వార్తలను పూర్తిగా ఖండించకుండా ప్రస్తుతం అలాంటి ప్లాన్స్ లేవు అని చెప్పడంతో భవిష్యత్తులో నయనతార రాజకీయాల్లోకి వస్తుందేమో అని మరో చర్చ మొదలైంది.
