Nayanthara : సూపర్ స్టార్ బిరుదుపై వివాదం.. స్పందించిన నయనతార..

ఇటీవల నయనతార అన్నపురాణి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో కూడా ఆమె పేరుకి లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ని జత చేశారు.

Nayanthara : సూపర్ స్టార్ బిరుదుపై వివాదం.. స్పందించిన నయనతార..

Nayanthara Reacts on Super Star Title Issue

Nayanthara : మనకి సూపర్ స్టార్ అంటే కృష్ణ ఆ తర్వాత మహేష్ బాబు.. కానీ తమిళ్ లో సూపర్ స్టార్ అంటే రజినీకాంత్(Rajinikanth). తమిళ్ లోనే కాదు బయట పరిశ్రమలలో కూడా ఆయన్ని సూపర్ స్టార్ అనే పిలుచుకుంటారు. రజినీకాంత్ స్టైల్ కి, నటనకి ఫిదా అయిన ప్రేక్షకులు ఆయన స్టార్ అయ్యాక సూపర్ స్టార్ అనే పిలుచుకుంటున్నారు. ఎప్పట్నుంచో రజినీకాంత్ సినిమాలకు సూపర్ స్టార్ అనే టైటిల్ కార్డు పడుతుంది. అయితే గత కొన్ని సినిమాల నుంచి నయనతారకు లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్ కార్డు వేస్తున్నారు.

నయనతార కమర్షియల్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగి అనంతరం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంది. దీంతో ఆమె అభిమానులు నయనతారను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు. ఇటీవల సినిమా టైటిల్స్ లో కూడా నయనతారకు లేడీ సూపర్ స్టార్ అని వేయడంతో వివాదంగా మారింది. రజినీకాంత్ అభిమానులు సూపర్ స్టార్ అనే టైటిల్ ఇంకెవరికి ఉండకూడదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల నయనతార అన్నపురాణి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో కూడా ఆమె పేరుకి లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ని జత చేశారు. దీంతో రజిని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నయనతారపై, ఆ మూవీ యూనిట్ పై ఫైర్ అవుతున్నారు. మరోపక్క విజయ్ కి కూడా సూపర్ స్టార్ పెట్టాలని కొంతమంది విజయ్ అభిమానులు పోస్టులు చేయడంతో ఈ సూపర్ స్టార్ వివాదం తమిళ్ లో పెద్ద వివాదంగా మారుతుంది. తాజాగా దీనిపై నయనతార స్పందించింది.

Also Read : Renu Desai : రేణు దేశాయ్ పుట్టిన రోజుకి కొడుకు అకిరా నందన్ ఏం గిఫ్ట్ ఇచ్చారో చూశారా?

అన్నపురాణి సినిమా ప్రమోషన్స్ లో నయనతార పాల్గొనగా సూపర్ స్టార్ వివాదంపై స్పందిస్తూ.. నేను తెరపై కేవలం నయనతార అనే టైటిల్ ఉండాలని చెప్పను. కానీ దర్శకుడు వినకుండా లేడీ సూపర్ స్టార్ అని వేశాడు. దీనికి నన్ను పది మంది పొగిడితే, 50 మంది తిడుతున్నారు. నాకు అలా పిలిపించుకోవాలని, ఆ ట్యాగ్ వేయించుకోవాలని ఏ మాత్రం లేదు అని చెప్పుకొచ్చింది.