Telangana Song : అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. దుమ్ముదులిపేస్తున్న తెలంగాణ సాంగ్ విన్నారా..?

తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తాజాగా ఓ పాటను చిత్రీకరించారు.

Nernala Kishore Telangana Special Dacchanna Darilo Song Released

Telangana Song : తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి, ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తాజాగా ఓ పాటను చిత్రీకరించారు. నేర్నాల క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ పాటను నిర్మించారు. దచ్చన్న దారిలో త్యాగాల.. అంటూ సాగే ఈ పాటను నేర్నాల కిషోర్ రచించి పాడటమే కాకుండా ఈ సాంగ్ వీడియోకు దర్శకత్వం కూడా వహించారు. ఈ పాటకు కెమెరామెన్ గా పని చేసిన శాంతి రాజ్ కొరియోగ్రఫీ కూడా చేశారు.

Also Read : Sudheer Babu : భార్య పెళ్లి చూపుల ఫోటో షేర్ చేసిన హీరో.. అప్పటికి, ఇప్పటికి ఎంత మారిపోయిందో చూడండి..

ఈ పాటలో దాదాపు 200 మందికి పైగా కళాకారులు నటించారు. అలాగే ఈ పాటని కరీంనగర్ జిల్లాలోని కొత్తగట్టు, మొలంగూర్ గుట్టలపై షూటింగ్ చేశారు. ఈ పాటలో ప్రజా యుద్ధనౌక గద్దర్ వేషధారణలో ఏ.డీ.ఎం.ఎస్ శివాజీ కనిపించి అలరించారు. తాజాగా ఈ పాటను ఘనంగా లాంచ్ చేశారు. ఈ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో నేర్నాల కిషోర్ మాట్లాడుతూ.. ఈ పాటను తెలంగాణ అమరుల కుటుంబాలకు అంకితం ఇస్తున్నామని, ఈ పాటను ప్రతి ఒక్కరు వినాలని తెలిపారు. మీరు కూడా ఈ పాటను వినేయండి.

ఈ సాంగ్ లాంచింగ్ కార్యక్రమానికి MLC మహేష్ కుమార్ గౌడ్, ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ, సినీ దర్శకులు ఎన్ శంకర్, హీరో సంజోష్, అరుణోదయ విమలక్క, విమల గద్దర్.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు