Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’.. నితిన్ పక్కన బాలీవుడ్ హీరోయిన్.. గ్లింప్స్ రిలీజ్..
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ని ప్రకటిస్తూ ఆమెకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు. (Alias Rukmini)
Alias Rukmini
Alias Rukmini : యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మాణంలో నితిన్ హీరోగా ఇటీవల అలియాస్ రుక్మిణి అనే సినిమాని ప్రకటించారు. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ని ప్రకటిస్తూ ఆమెకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు.
అలియాస్ రుక్మిణి సినిమాలో నితిన్ సరసన బాలీవుడ్ భామ ఆఫియా సయ్యద్ నటిస్తుంది. ఆఫియా మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి ఇటీవలే బాలీవుడ్ లో ప్రేమలు సినిమా రీమేక్ ప్రేమ కీటను తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అలియాస్ రుక్మిణి తో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈమెకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఆఫియా సయ్యద్ స్కూల్ లో స్ట్రిక్ట్ టీచర్ పాత్రలో రుక్మిణిగా కనిపించబోతుంది తెలుస్తుంది. ఈ సినిమాలో నితిన్ స్కూల్ లో సర్ గా కనిపించబోతున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ సినిమా రానుంది.
Also Read : The RajaSaab : రాజాసాబ్ ఫెయిల్యూర్ పై స్పందించిన నిర్మాత.. అలా చేయకుండా ఉండాల్సింది..
మీరు కూడా అలియాస్ రుక్మిణి నుంచి వచ్చిన ఆఫియా సయ్యద్ గ్లింప్స్ చూసేయండి..
