టాలీవుడ్ హీరో నితిన్, షాలిని దంపతులకు పండంటి మగబిడ్డ
తమ కుటుంబంలోకి కొత్త స్టార్‌ను ఆహ్వానిస్తున్నామని నితిన్ ఓ ఫొటోను ట్వీట్ చేశాడు.
టాలీవుడ్ హీరో నితిన్, షాలిని దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. తమ కుటుంబంలోకి కొత్త స్టార్‌ను ఆహ్వానిస్తున్నామని నితిన్ ఓ ఫొటోను ట్వీట్ చేశాడు. తమ కుమారుడి చేతిని నితిన్, షాలిని పట్టుకున్నట్లు అందులో కనపడుతోంది.
ఆ తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. నితిన్ తన స్నేహితురాలు షాలినీని 2020 జులై 26న వివాహం చేసుకున్న తెలిసిందే. కరోనా లాక్డౌన్ సమయంలో వారి వివాహం జరిగింది. జయం సినిమాతో నితిన్ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
కాగా, జయం, దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, భీష్మ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నితిన్ నటించాడు. ప్రస్తుతం తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాల్లో నితిన్ నటిస్తున్నాడు. నితిన్ సినిమాల్లోకి అడుగుపెట్టిన సమయంలో భారీ హిట్లు కొట్టాడు.
ఆ తర్వాత హిట్లు లేక చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఇష్క్ సినిమా హిట్ కావడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. భీష్మ సినిమాతో మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు.
Welcoming the NEWEST STAR 🌟 of our family!! ❤️ pic.twitter.com/otBHvwSnNo
— nithiin (@actor_nithiin) September 6, 2024