Devara : ‘దేవర’ సెట్స్ నుంచి వీడియో లీక్.. ఎన్టీఆర్ జస్ట్ అలా నడిచొస్తుంటే..
గోవాలో సముద్రం దగ్గర షూట్ జరుగుతుండగా ఎన్టీఆర్ సముద్రంలో నుంచి నడుచుకుంటూ వస్తున్న వీడియో లీక్ అయింది.
![Devara : ‘దేవర’ సెట్స్ నుంచి వీడియో లీక్.. ఎన్టీఆర్ జస్ట్ అలా నడిచొస్తుంటే.. Devara : ‘దేవర’ సెట్స్ నుంచి వీడియో లీక్.. ఎన్టీఆర్ జస్ట్ అలా నడిచొస్తుంటే..](https://10tv.in/wp-content/uploads/2024/03/jr-ntr.jpg)
NTR Devara Movie Shoot Video Leaked Video Goes Viral
Devara : ఇటీవల అన్ని సినిమాల నుంచి షూటింగ్ టైంలోనే వీడియోలు లీక్ అవుతున్నాయి. మూవీ యూనిట్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట నుంచి షూటింగ్ విజువల్స్ లీక్ అవుతూనే ఉన్నాయి. మొన్నటిదాకా పుష్ప, గేమ్ ఛేంజర్ సినిమాలు లీక్స్ బారిన పడితే ఇప్పుడు దేవర మొదలైంది. ఎన్టీఆర్(NTR) దేవర సినిమా ప్రస్తుతం గోవాలో(Goa) షూటింగ్ జరుగుతుంది. ఈ షూట్ లో జాన్వీతో ఓ సాంగ్, కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారని సమాచారం.
గోవాలో సముద్రం దగ్గర షూట్ జరుగుతుండగా ఎన్టీఆర్ సముద్రంలో నుంచి నడుచుకుంటూ వస్తున్న వీడియో లీక్ అయింది. చాలా దూరంగా చెట్టు మీద నుంచి ఎవరో ఈ వీడియోని తీసి లీక్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తూ దేవరని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఈ లీక్ వీడియోపై దేవర యూనిట్ ఏమన్నా చర్యలు తీసుకుంటుందా చూడాలి.
Also Read: Om Bheem Bush : ‘ఓం భీమ్ బుష్’ రివ్యూ.. సెకండ్ హాఫ్ ఎవరూ ఊహించలేరు.. నవ్వించి.. భయపెట్టి..
ఇక దేవర కొరటాల శివ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ సమాచారం ప్రకారం మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజున దేవర నుంచి ఓ పాటని విడుదల చేస్తారని సమాచారం.
All Hail The Tigerrrr 🐯🔥#Devara pic.twitter.com/6YRisONLNQ
— I'm a Fan Of NBK (@Chaitanya9045) March 21, 2024
#Devara Leaked Video 🥵🔥 pic.twitter.com/YK9X1ZImte
— Daya_9999 (@Praveenalluri33) March 22, 2024