Devara : ప్రీ రిలీజ్ బిజినెస్‌తో దేవర రికార్డులు.. వంద, రెండు వందల కోట్లు కాదు.. ఏకంగా..!

ప్రీ రిలీజ్ బిజినెస్‌తో దేవర రికార్డులు సృష్టిస్తున్నాడు. అది కూడా వంద, రెండు వందల కోట్లు కాదు అంతకుమించి బిజినెస్ జరుగుతుంది.

Devara : ప్రీ రిలీజ్ బిజినెస్‌తో దేవర రికార్డులు.. వంద, రెండు వందల కోట్లు కాదు.. ఏకంగా..!

NTR Janhvi Kapoor Devara 1 pre release business details

Devara : కళ్యాణ్ రామ్ నిర్మాణంలో మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం జాన్వీ కపూర్, శృతి మరాఠే హీరోయిన్స్ గా కనిపిస్తుంటే.. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం పై టాలీవుడ్ టు బాలీవుడ్ భారీ అంచనాలే నెలకొన్నాయి.

దీంతో ఈ సినిమాకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. అది కూడా వంద, రెండు వందల కోట్లు కాదు అంతకుమించి బిజినెస్ జరుగుతుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మొదటి భాగం థియేట్రికల్, డిజిటల్ అండ్ ఆడియో రైట్స్ భారీ ధర పలుకుతున్నాయి. రెండు తెలుగు స్టేట్స్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 130 కోట్లకు పైగా జరిగినట్లు చెబుతున్నారు.

Also read : Ram Charan – Chiranjeevi : గ్రాండ్‌గా డైరెక్టర్ శంకర్ కూతురు రిసెప్షన్.. హాజరైన మెగాస్టార్, గేమ్ ఛేంజర్.. మరింతమంది సినీ ప్రముఖులు..

ఇక సౌత్ లోని ఇతర స్టేట్స్, నార్త్ స్టేట్స్ కలిపి 50 నుంచి 60 కోట్ల బిజినెస్ జరిగినట్లు చెబుతున్నారు. ఓవర్ సీస్ రైట్స్ 27 కోట్లకు హంసిని ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుందట. ఇక ఓటీటీ రైట్స్ ని 155 కోట్లకు నెట్‌ఫ్లిక్స్, ఆడియో రైట్స్ ని 33 కోట్లకు టి సిరీస్ సొంతం చేసుకుందట. ఈ మొత్తం కలుపుకొని 400 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కాగా శాటిలైట్ రైట్స్ ఇంకా బ్యాలన్స్ ఉంది.

మూవీ నుంచి టీజర్, ట్రైలర్ లేదా ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాకుండానే.. ఈ రేంజ్ బిజినెస్ జరగడం గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ని గమనించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌కే ఈ రేంజ్ బిజినెస్ జరిగితే.. ఇక మొదటి భాగం హిట్, సెకండ్ పార్ట్ కి ఇంకెతటి బిజినెస్ జరుగుతుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.