×
Ad

P.V. Narasimha Rao : ఎన్టీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పి.వి. నరసింహ రావు బయోపిక్..

స్వర్గీయ భారత ప్రధానమంత్రి పి.వి. నరసింహ రావు బయోపిక్‌ను ‘ఎన్టీఆర్ ఫిల్మ్స్’ బ్యానర్ మీద భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు తెలిపారు..

  • Published On : June 28, 2021 / 12:52 PM IST

P V Narasimha Rao Biopic Releasing On 28 June 2022

P.V. Narasimha Rao: బహుభాషా కోవిదుడు-అసాధారణ ప్రజ్ఞా దురీణుడు.. స్వర్గీయ భారత ప్రధానమంత్రి పి.వి. నరసింహ రావు బయోపిక్‌ను ‘ఎన్టీఆర్ ఫిల్మ్స్’ బ్యానర్ మీద భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు తెలిపారు. ఈయన ఇంతకుముందు శ్రీహరితో ‘శ్రీశైలం’ సినిమా నిర్మించారు. పి.వి. నరసింహ రావు 100వ జయంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు వెల్లడించారు నిర్మాత.

పలు సూపర్ హిట్ చిత్రాల రూపకర్త-ప్రముఖ సీనియర్ దర్శకుడు ధవళ సత్యం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెలుగు-హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో తెరకెక్కే ఈ బయోపిక్‌లో… జాతీయస్థాయిలో సుపరిచితుడైన ఓ ప్రముఖ నటుడు పి.వి. నరసింహరావు పాత్రను పోషించనున్నారు.

స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో సెట్స్‌కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పి.వి. జయంతి రోజు.. 2022, జూన్ 28న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.