Pawan Kalyan : కీరవాణి తల్లి మరణంపై సంతాపం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్..

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తల్లి 'భానుమతి' వృద్దాప్య సమస్యలతో నిన్న మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇక భానుమతి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు చింతిస్తూ ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కీరవాణి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.

pawan kalyan pay last respects to keeravani mother

Pawan Kalyan : టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కీరవాణి తల్లి ‘భానుమతి’ వృద్దాప్య సమస్యలతో బాధపడుతుండగా, సినివారం ఆమెను హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే నిన్న మధ్యాహ్నం ఆమె చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మరణంతో కీరవాణి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

MM Keeravani: టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి మాతృవియోగం

ఇక భానుమతి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు చింతిస్తూ ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కీరవాణి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. “ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి మాతృమూర్తి శ్రీమతి భానుమతి గారు కన్ను మూశారని తెలిసి చింతించాను. శ్రీమతి భానుమతి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. భానుమతి గారు భర్త శ్రీ శివశక్తి దత్తగారికి, ఆమె తనయుడు శ్రీ కీరవాణి గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అంటూ తన సంతాపం వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. కాగా భానుమతి భౌతికకాయాన్ని నిన్న సాయంత్రం డైరెక్టర్ రాజమౌళి నివాసానికి తరలించారు. ఆమె అంత్యక్రియలకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ఇక ఇటీవలే RRR సినిమాకు గాను ఇంటర్నేషనల్ అవార్డు అందుకొని ఆనందంలో ఉన్న కీరవాణి, తల్లి మరణంతో తీవ్ర దు:ఖంలో మునిగిపోయాడు.