Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ మొదలు.. త్వరలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ..
పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. (Ustaad Bhagat Singh)
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చ్ లో రిలీజ్ అవుతుందని టాలీవుడ్ సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.(Ustaad Bhagat Singh)
మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Sonal Chauhan: పొట్టి డ్రెస్సులో గ్లామర్ ట్రీట్.. రచ్చలేపుతున్న లెజెండ్ బ్యూటీ.. ఫొటోలు
తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. నేడు ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ మేరకు డబ్బింగ్ వర్క్ మొదలుపెట్టిన ఫోటోలను షేర్ చేసారు.
అలాగే పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే వచ్చి డబ్బింగ్ చెప్తారని మూవీ యూనిట్ తెలిపింది. దీంతో ఫ్యాన్స్ పవన్ డబ్బింగ్ స్టిల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చిన ‘దేఖ్ లేంగే సాలా..’ సాంగ్ కూడా హిట్ అయింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డబ్బింగ్ పనులు మొదలుపెట్టిన వీడియోని కూడా షేర్ చేసారు మూవీ యూనిట్.
Also Read : Annagaru Vastharu OTT: డైరెక్ట్ ఓటీటీలోకి ‘అన్నగారు’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
#UstaadBhagatSingh dubbing begins on an auspicious note ✨
Get ready for the POWERFUL DIALOGUES penned by our CULT CAPTAIN 🔥🔥
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @rparthiepan @DoP_Bose #AnandSai @Venupro @MythriOfficial @SonyMusicSouth… pic.twitter.com/gtPbA7KY3r
— Mythri Movie Makers (@MythriOfficial) January 27, 2026
