ఫ్యాన్ జోలికొస్తే పవన్ కళ్యాణ్ ఇంతే: బౌన్సర్లపై అరిచేశారు

  • Publish Date - September 23, 2019 / 05:30 AM IST

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది.

ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ వేదికపైకి వచ్చి ప్రసంగిస్తుండగా.. ఆయన వెనకాలే మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, వీవీ వినాయక్, రామ్ చరణ్ నిల్చొని ఉన్నారు. ఇంతలో ఓ అభిమాని నేరుగా వేదికపైకి దూసుకొచ్చి జనసేనాని కాళ్లపై పడిపోయాడు. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తం అయిన బౌన్సర్లు ఆ అభిమానిని పక్కకు లాగేసి కిందకు పంపబోయారు. దీంతో వెంటనే స్పందించిన పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ అలా అభినానిని లాగొద్దు అంటూ కోపంగా బౌన్సర్లపై అరిచేశారు.

ఆప్ లోగ్ ఛలే జాయే.. అరే భాయ్.. ఆప్ లోగ్ పీచే జాయే ప్లీజ్. ఛలే ఆప్ అని అన్నారు పవన్ కళ్యాణ్. వెంటనే ఆ అభిమానిని హత్తుకొని అభిమానులకు విలువ ఇచ్చారు. దీనిని చూసిన మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ.. కేకలు పెట్టడంతో స్టేడియం హోరెత్తిపోయింది. స్టేజ్ మీదకు వచ్చిన మెగా అభిమాని అభిమాని ఆనందానికి అవదుల్లేవు.