కలుద్దాం రండి : చిరు, చరణ్‌లకు ప్రధాని పిలుపు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లకు ఇన్విటేషన్ పంపారు..

  • Publish Date - November 1, 2019 / 05:24 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లకు ఇన్విటేషన్ పంపారు..

ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లకు పర్సనల్‌గా కలవడానికి ఇన్విటేషన్ పంపారు.. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా.. ప్రధాన మంత్రి కార్యాలయం నిర్వహించిన ‘ఛేంజ్‌ వితిన్‌ మీట్‌’ కార్యక్రమానికి బాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ నుంచి ఒక్క దిల్ రాజు మాత్రమే వెళ్లాడు. కేవలం బాలీవుడ్ వారిని మాత్రమే ఆహ్వానించడంపై సోషల్ మీడియా ద్వారా నిరసన గళం వినిపించారు సీనియర్‌ నటి ఖుష్బూ, రామ్ చరణ్ భార్య ఉపాసన.. ఉపాసన ఉద్దేశం ఏంటనేది తర్వాత చరణ్ వివరించిన సంగతి తెలిసిందే.

Read Also : క్రిస్మస్‌కు ‘ఇద్దరిలోకం ఒకటే’

అయితే రీసెంట్‌గా ప్రధాని కార్యాలయం నుంచి చిరు, చరణ్‌లకు పర్సనల్ మీటింగ్‌కు రమ్మని ఆహ్వానం పంపారు.. ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వూలో చిరంజీవి, రామ్ చరణ్ కన్ఫమ్ చేశారు. త్వరలో చిరు, చరణ్ ప్రధాని మోడీని కలవనున్నారు.