Coolie actor Soubin Shahir: సౌబిన్ సాహిరా మజాకా.. ఎన్ని కోట్లు పెట్టి కారు కొన్నాడో తెలుసా.. ఆ వీడియో చూస్తే..

ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ కారు విలువ రూ.3.30 కోట్లు. తన కుటుంబంతో కలిసి అతడు ఈ కారుతో ఫొటోలు తీసుకున్నాడు. (Coolie actor Soubin Shahir:)

Coolie actor Soubin Shahir: సౌబిన్ సాహిరా మజాకా.. ఎన్ని కోట్లు పెట్టి కారు కొన్నాడో తెలుసా.. ఆ వీడియో చూస్తే..

Malayalam actor Soubin Shahir

Updated On : August 16, 2025 / 7:05 PM IST

Coolie actor Soubin Shahir: మలయాళం నటుడు సౌబిన్ షాహిర్ 2024లో “సర్వైవల్ థ్రిల్లర్” మంజుమ్మెల్ బాయ్స్ లో నటించాడు. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు తన ఫేమ్‌ను మరింత పెంచుకున్నాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా “కూలీ“లో కీలక ప్రతినాయక పాత్రలో నటించాడు.

“మోనికా”లో షాహిర్ స్టెప్పులు అదుర్స్‌

ఈ సినిమా 2025 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల అయింది. కూలీలోని ఐటం సాంగ్ “మోనికా”లో షాహిర్ వేసి స్టెప్పులను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.

ఆ సాంగ్‌లో పూజా హెగ్డేను మించి షాహిర్ మెరిశాడని ప్రేక్షకులు అంటున్నారు. షూటింగ్ సెట్‌లో సౌబిన్ ప్రదర్శన చూసిన రజనీకాంత్ కూడా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.

Also Read: వినాయకుడి 32 రూపాలు.. వాటికి అర్థాలు ఇవే.. విఘ్నహర శరణం..

కుటుంబంతో కలిసి కారుతో ఫొటోలు

ఓటీటీల్లో మలయాళ డబ్బింగ్ మూవీలు చూసే వారికి సౌబిన్ గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఈ మధ్య సౌబిన్ (Coolie actor Soubin Shahir) బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ కారుని కొన్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ కారు విలువ రూ.3.30 కోట్లు. తన కుటుంబంతో కలిసి అతడు ఈ కారుతో ఫొటోలు తీసుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Roadway Cars (@roadwaycars)