Bhupinder Singh : రీల్ లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ విలన్.. ప్రముఖ నటుడు అరెస్ట్
సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించిన ఆ నటుడు నిజ జీవితంలో విలన్‌గా మారిపోయాడు. ఓ కుటుంబంతో జరిగిన వివాదంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కట్ చేస్తే కటకటాల పాలయ్యాడు.
Bhupinder Singh : చెట్లను తొలగించే విషయంలో ఓ కుటుంబంతో జరిగిన వివాదంలో ఆ నటుడు విచక్షణ కోల్పోయాడు. ఆవేశంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా ఒకరు చనిపోయారు. ప్రముఖ నటుడు, విలన్ భూపిందర్ సింగ్ రియల్ లైఫ్‌లో విలన్‌గా మారి కటకటాల పాలయ్యారు.
Sunny Deol : ఫుల్లుగా తాగి రోడ్డుపై వీరంగం.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్
ప్రముఖ నటుడు భూపిందర్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చెట్లను నరికే విషయంలో ఓ కుటుంబంతో గొడవ పడ్డ భూపిందర్ సింగ్ కాల్పులు జరపడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌన్కేదా ఖాద్రీ గ్రామంలో భూపిందర్ సింగ్‌కి ఫామ్ హౌస్ ఉంది. ఆ పక్కనే గుర్దీప్ సింగ్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇద్దరి స్థలం సరిహద్దులను ఆనుకుని ఉన్న చెట్లను నరికే విషయంలో గొడవ జరిగింది. ఆవేశం ఆపుకోని భూపిందర్ సింగ్ తన దగ్గర ఉన్న లైసెస్స్డ్ పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గుర్దీప్ సింగ్, అతని భార్య మీరాబాయ్, కొడుకు బుటా సింగ్‌లకు తీవ్ర గాయాలు కాగా.. మరో కుమారుడు గోబింద్ సింగ్ స్పాట్లో చనిపోయాడు. భూపిందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
Pushpa Jagadeesh : మహిళ ఆత్మహత్య.. పుష్ప నటుడు జగదీశ్ అరెస్ట్..!
సీరియల్స్‌తో తన కెరియర్ స్టార్ట్ చేసిన భూపిందర్ సింగ్ చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించాడు. పలు బాలీవుడ్ సినిమాల్లో కనిపించారు. తెలుగులో తమ్ముడు, అన్నయ్య, అంజి, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలతో పాటు దేవీపుత్రుడు, భలేవాడివి బాసు వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న భూపిందర్ సింగ్ అనూహ్యంగా ఈ కేసులో జైలు పాలయ్యాడు.