Posani Krishna Murali : సినిమాలకు ఇప్పట్లో నంది అవార్డులు ఇవ్వలేము.. నాటకాలకు మాత్రమే.. నంది అవార్డులపై పోసాని ప్రెస్ మీట్..

తాజాగా నటుడు, ఏపీ ఫిలిం అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి నంది అవార్డుల గురించి మాట్లాడారు.

Posani Krishna Murali comments on Nandi Awards wont give to movies now

Nandi Awards :  గత కొన్నాళ్లుగా నంది అవార్డుల గురించి చర్చలు వస్తూనే ఉన్నాయి. పలువురు సినీ ప్రముఖులు నంది అవార్డులు ఇవ్వాలని కోరారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో కూడా మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. దాదాపుగా ఆరేళ్ళ నుంచి నంది అవార్డులు ఇవ్వట్లేదు. ఇటీవల వీటిపై చర్చలు ఎక్కువయ్యాయి. తాజాగా నటుడు, ఏపీ ఫిలిం అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి నంది అవార్డుల గురించి మాట్లాడారు.

ఈ ప్రెస్ మీట్ లో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. నంది నాటక అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వల్ల రెండేళ్లు, నాడు నేడు పనుల వల్ల రెండేళ్లు అవార్డులు ఇవ్వలేదు. సినిమా, టీవీ కార్యక్రమాలకు ఇప్పట్లో నంది అవార్డులు ఇవ్వలేమని ముఖ్యమంత్రికి చెప్పాను. పద్యనాటకాలు మన ప్రాంతానికే ప్రత్యేకం అందుకే వాటికి నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. అవార్డులు ఆ వర్గానికో ఈ వర్గానికో కాకుండా నిజమైన అర్హులకు ఇవ్వాలన్నదే మా లక్ష్యం. అర్హులైన వారికి నంది అవార్డులు ఇవ్వలేదని తేలితే నేను పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతాను. వంద సినిమాలకు కధలు రాసినా నాకు ఒక్క నంది అవార్డూ రాలేదు. కనీసం 10-15 సినిమాలకు నంది అవార్డు వస్తుందని ఆశించాను. నాపై కోపంతోనే కొందరు నన్ను బ్లాక్ లిస్టులో పెట్టారు అని అన్నారు.

Vindu Dara Singh : మందు తాగి ఆదిపురుష్ సినిమా తీశారా? మా నాన్న పరువు తీశారు.. చిత్ర యూనిట్ పై ఫైర్ అయిన నటుడు..

అలాగే.. ఏపీలో ఉచితంగా షూటింగ్ లు చేసుకోవచ్చని ఉత్తర్వులే ఉన్నాయి. జీవోలతోనో నిబంధనలతోనో సినిమా పరిశ్రమను ఏపీకి రప్పించలేం. రాష్ట్రం విడిపోయాక సినిమా పరిశ్రమకు చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఏపీలోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ తో మాట్లాడతాను అని అన్నారు. దీంతో నంది అవార్డులు సినిమాలకు ఉండవు అని పోసాని చెప్పిన మాటలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. దీనిపై అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.