Prabhas Sister : ప్రభాస్ చెల్లి ఎంత పని చేసింది.. రాఖీ రోజు అందరితో ఫొటోలు షేర్ చేసి.. నిరాశలో ఫ్యాన్స్..

ప్రభాస్ చెల్లి, కృష్ణం రాజు కూతురు ప్రసీద ఉప్పలపాటి కూడా అందరికి పరిచయమే.

Prabhas Sister : ప్రభాస్ చెల్లి ఎంత పని చేసింది.. రాఖీ రోజు అందరితో ఫొటోలు షేర్ చేసి.. నిరాశలో ఫ్యాన్స్..

Prabhas Sister

Updated On : August 10, 2025 / 7:39 AM IST

Prabhas Sister : ప్రభాస్ చెల్లి, కృష్ణం రాజు కూతురు ప్రసీద ఉప్పలపాటి కూడా అందరికి పరిచయమే. కృష్ణం రాజు కూతుళ్లలో ప్రసీద ఒక్కరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రసీద తన తండ్రి నిర్మాణ సంస్థని కూడా చూసుకుంటుంది. ప్రసీద ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలు, ప్రభాస్ తో దిగే ఫొటోలు షేర్ చేస్తుంది.

అయితే నిన్న రాఖీ సందర్భంగా ప్రసీద తన అన్నదమ్ములతో కలిసి దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది. ప్రభాస్ తో దిగిన ఫోటో మాత్రం షేర్ చేయలేదు. కానీ ప్రభాస్ కి కట్టిన రాఖీని చూపిస్తూ కేవలం ప్రభాస్ చేతి ఫోటోని మాత్రమే షేర్ చేసింది. ఆ ఫోటోకి ప్రభాస్ ని కూడా ట్యాగ్ చేసింది. కానీ ప్రభాస్ తో దిగిన ఫోటో షేర్ చేయలేదు, ప్రభాస్ ఫేస్ కూడా చూపించలేదు.

Prabhas Sister

Also See : Pooja Hegde : అన్నయ్యతో పూజా హెగ్డే రాఖీ సెలబ్రేషన్స్.. ఫొటోలు..

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతూ ప్రభాస్ ని చూపించొచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి గతంలో ప్రభాస్ తో దిగిన ఫొటోలు షేర్ చేసిన ప్రసీద ఇప్పుడు ఎందుకు ప్రభాస్ ని చూపించలేదో.

 

Also Read : Mahesh Babu : మహేష్ బాబు మేనకోడలిని చూశారా? సుధీర్ బాబు తనయులతో రాఖీ స్పెషల్ ఫోటో వైరల్..