Prakash Raj – Pony Verma : మా బంధానికి 11 ఏళ్లు..
జీవిత భాగస్వామి పోనీ వర్మకు ప్రేమతో వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్తూ.. పెళ్లి నాటి పిక్ షేర్ చేశారు ప్రకాష్ రాజ్..
- sekhar
- Published On : August 24, 2021 / 11:04 AM IST
Prakash Raj Pony Verma
Prakash Raj – Pony Verma: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ – పాపులర్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మల వెడ్డింగ్ యానివర్సరీ నేడు (ఆగస్టు 24). 2010 లో ఇదే రోజు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కారు. వీరిది ప్రేమ వివాహం. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రకాష్ రాజ్ బ్యూటిఫుల్ ట్వీట్ చేశారు.
ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో తనకు తోడు నీడగా ఉన్న జీవిత భాగస్వామి పోనీ వర్మకు ప్రేమతో వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్తూ.. పెళ్లి నాటి పిక్ షేర్ చేశారు ప్రకాష్ రాజ్. ఈ దంపతులకు వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు. తమ ప్రేమ బంధానికి 11 ఏళ్లు పూర్తయ్యాయంటూ పోనీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు.
దివంగత నటి, డ్యాన్సర్ సిల్క్ స్మిత చెల్లెలు.. నటి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకున్నారు ప్రకాష్ రాజ్. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2004లో కుమారుడు మరణించాడు. 2009లో మొదటి భార్యకు విడాకులిచ్చిన ప్రకాష్ రాజ్ 2010లో పోనీ వర్మను పెళ్లాడారు.
