Prakash Raj : మెగాస్టార్‌ని మీట్ అయిన ప్రకాష్ రాజ్..
రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవిని జిమ్‌లో కలిశారు ప్రకాష్ రాజ్.. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు..
- sekhar
- Published on- August 17, 2021 / 11:04 AM IST
Prakash Raj
Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని అనౌన్స్ చేశారో అప్పటినుండి వార్తల్లో నిలుస్తున్నారు. లోకల్ – నాన్ లోకల్ నుండి రకరకాలు ఆయణ్ణి టార్గెట్ చేస్తూ ఎవరెన్ని విమర్శలు చేసినా మౌనంగానే ఉండిపోయారు.
Maa Elections: తెగేదాకా లాక్కండి.. ఎన్నికలపై ప్రకాష్ రాజ్!
కట్ చేస్తే.. మధ్యలో ‘తెగేదాకా లాగొద్దు’.. అని ఓసారి.. ‘జెండా ఎగరేస్తాం’ అని మరోసారి ట్వీట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎవరేమనుకున్నా ప్రకాష్ రాజ్‌కు మెగాస్టార్ సపోర్ట్ ఉంటుందని మెగా బ్రదర్ నాగబాబు చెప్పారు. ప్రకాష్ రాజ్ కూడా అదే ధీమాతో ఉన్నారు.
రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవిని జిమ్‌లో కలిశారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘ఈరోజు తెల్లవారు ఝామున బాస్‌ని జిమ్‌లో కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’.. అని రాసుకొచ్చారు.
కాగా ఇటీవల షూటింగ్‌లో ప్రమాదానికి గురైన ప్రకాష్ రాజ్ సర్జరీ పూర్తయ్యాక విశ్రాంతి తీసుకుంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను నటులు, ‘మా’ సభ్యులు, తన మద్దతుదారులతో కలిసి జరుపుకున్నారు ప్రకాష్ రాజ్. జెండా వందనం అనంతరం టీమ్ అందరూ కలిసి లంచ్ పార్టీ ఎంజాయ్ చేశారు.
