Priyanka Chopra : సారీ చెప్పిన ప్రియాంక..
ఆ షో వివాదంలో చిక్కకున్నందున ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్షమాపణలు చెప్పింది ప్రియాంక చోప్రా..
- sekhar
- Published On : September 17, 2021 / 12:19 PM IST
Priyanka Chopra
Priyanka Chopra: బాలీవుడ్ నటి, హాలీవుడ్ కోడలు ప్రియాకం చోప్రా హోస్ట్ చేస్తున్న ‘ది యాక్టివిస్ట్’ వివాదంలో చిక్కుకుంది. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. ఈ రియాలిటీ షోలో ప్రియాంకతో పాటు సింగర్ ఉషర్, డ్యాన్సర్ జూలియేన్ హగ్ ఇద్దరు కూడా హోస్టింగ్ చేస్తున్నారు.
Tamannaah : నిర్మాతలకు సారీ చెప్పిన తమన్నా..
అక్టోబర్ నుంచి సీబీఎస్ (CBS) ఛానల్‌లో టెలికాస్ట్ అవనుంది. సోషల్ కాజ్ కోసం మూడు టీమ్‌ల మధ్య ఈ పోటీ జరుగుతోంది. హెల్త్, ఎడ్యుకేషన్, పర్యావరణం వంటి అంశాలపై మేటి కార్యకర్తలతో చర్చించి, వారిచ్చే సలహాలు, సూచనలను ఇటలీలో జరిగే జీ20 సదస్సులో వెల్లడించాలని ప్లాన్ చేశారు. ‘ది యాక్టివిస్ట్’ ను ముందుగా సిరీస్ రూపంలో తీసుకురావాలనుకున్నారు. కానీ తర్వాత డాక్యుమెంటరీగా తీయాలని నిర్ణయించుకున్నారు.
కట్ చేస్తే ప్రసారం కావడానికంటే ముందే ఈ షో పై విమర్శలు వచ్చాయి. పైగా ఆ విమర్శలను గ్లోబల్ సిటిజన్ ఆహ్వానించింది కూడా. గ్లోబల్ యాక్టివిజమ్ అనేది సహకారంతో జరుగుతుందని కానీ పోటీతత్వంతో కాదని గ్లోబల్ సిటిజన్ పేర్కొంది. దీంతో.. రియాలిటీ షో తో తాను చేసుకున్న అగ్రిమెంట్ ఎందరినో నిరాశపరిచిందని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని పోస్ట్ చేసింది ప్రియాంక.
