కంగనాకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నమణికర్ణిక నిర్మాత కమల్ జైన్.
మణికర్ణిక సినిమా విషయంలో నటి కంగనా రనౌత్, దర్శకుడు క్రిష్‌ల మధ్య వార్ నడుస్తుంది. క్రిష్, మణికర్ణిక సినిమాను దాదాపు 70 శాతం పూర్తిచేస్తే, తను అందుబాటులో లేని టైమ్‌లో నిర్మాతకి లేనిపోనివి చెప్పి, తనకిష్టమొచ్చినట్టు క్యారెక్టర్ల నిడివి తగ్గించడం, రీషూట్లు చెయ్యడం చేసిందనీ కంగనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ విషయంలో పలువురు సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తులు క్రిష్‌కి మద్దతు తెలిపారు. కంగనా చెల్లి రంగోలి, ట్విట్టర్ ద్వారా, ఈ వివాదాన్ని పెద్దది చెయ్యొద్దని క్రిష్‌ని వేడుకుంది. అయితే, ఇప్పటి వరకు కంగనా ఈ విషయంపై స్పందించలేదు. ఇప్పుడు మణికర్ణిక నిర్మాత కమల్ జైన్, కంగనాకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నాడు.
రీసెంట్‌గా క్రిష్, కంగనాల వివాదం గురించి కమల్ మాట్లాడుతూ, క్రిష్ కావాలనే మణికర్ణిక సినిమాకి నష్టం కలిగిస్తున్నాడు. అతను చెయ్యని పనికి క్రెడిట్ అడిగితే ఎలా ఇస్తాం. ఆయన చెప్పేది నిజమే అయితే లీగల్‌గా ప్రొసీడ్ అవ్వొచ్చుకదా.. సినిమా విషయంలో అతనికి చెప్పకుండా మేమేం చెయ్యలేదు. సినిమా మొదటినుండి, చివరి వరకు కష్టపడ్డ కంగనా గురించి క్రిష్ ఇలా మాట్లాడడం మంచి పద్ధతికాదు అని కమల్ అన్నాడు. ఈ వివాదం గురించి మణికర్ణిక రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్.. మణికర్ణిక సినిమాను వివాదాలు చుట్టుముట్టడం నాకేమాత్రం ఇష్టంలేదు.. సినిమాకి క్రిష్, కంగనా ఇద్దరూ సమానంగా కష్ట పడ్డారు.. ఈ వివాదం ఇక్కడితో ఆగిపోవాలని కోరుకుంటున్నా అన్నాడు. వీరి వ్యాఖ్యలపై క్రిష్ ఎలా రెస్పాండ్ అవుతాడో మరి.