Nagavamsi : హీరోలు అడ్వాన్స్ లు తీసుకోవడం మానేశారు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిర్మాత..
తాజాగా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. (Nagavamsi)
Nagavamsi
Nagavamsi : ఒక హీరో లేదా డైరెక్టర్ హిట్ కొట్టాడంటే వాళ్లకు నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చి వాళ్ళ డేట్స్, లేదా వాళ్ళతో ప్రాజెక్టు లాక్ చేసుకుంటారు. ఒక్కోసారి ఆ ప్రాజెక్ట్స్ ఆలస్యం అవ్వడం, అసలు ఆ సినిమానే అవ్వకపోవడం, అడ్వాన్స్ లు తిరిగి రాకపోవడం.. కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా కొంతమంది నిర్మాతలు హీరోలు, దర్శకులకు అడ్వాన్స్ లు ఇస్తున్నారు.
అయితే తాజాగా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు.
Also See : Allu Arjun : వైజాగ్లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్.. సందడి చేసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్..
నాగవంశీ మాట్లాడుతూ.. ఒకప్పుడు మేము కూడా హీరోలకు అడ్వాన్సులు ఇచ్చి డేట్స్ లాక్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నిర్మాతలు ఇస్తామన్నా హీరోలు అడ్వాన్స్ లు తీసుకోవట్లేదు. సినిమా ఇవాళ ఓకే అయితే ఒక ఆరు నెలలలకు షూటింగ్ కి వెళ్తుంది. దాంతో హీరోలు సెట్ కి వెళ్లే ముందు కొంత, ఒక షెడ్యూల్ అయ్యాక కొంత, షూట్ మొత్తం అయ్యాక మిగిలింది ఇవ్వు అని రూల్స్ పెడుతున్నారు. అంతే కానీ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియకుండా అడ్వాన్సులు అడగట్లేదు. అది వాళ్లకు కూడా భారంగా మారుతుంది.
ఉదాహరణకు నెక్స్ట్ సినిమా నాకు చేస్తానని అని మాట ఇచ్చి అడ్వాన్స్ తీసుకుంటే ఒకవేళ నేను తీసుకొచ్చే దర్శకుడి కంటే ఇంకో నిర్మాణ సంస్థ దగ్గర ఇంకా బెటర్ డైరెక్టర్, తనకు నచ్చిన డైరెక్టర్, ఇంకా బెటర్ కథ ఉంటే నేను ఆబ్లిగేషన్ అయిపోతాను. మొహమాటానికి నాకు సినిమా చేయాల్సి వస్తుంది. అందుకే హీరోలే అడ్వాన్సులు తీసుకోవడం మానేశారు అని తెలిపారు.
Also Read : Ajay Bhupathi : హీరోగా మహేష్ అన్న తనయుడి ఎంట్రీ.. ఫస్ట్ సినిమానే ఫ్లాప్.. స్పందించిన దర్శకుడు..
ఒకరకంగా ఇది ఇండస్ట్రీకి మంచి విషయమే. హీరోకి అడ్వాన్స్ లు ఇచ్చి సినిమా ఎపుడు మొదలవుతుంది తెలీక, సినిమా అవ్వకపోతే ఆ డబ్బులు తిరిగి వస్తాయో తెలియక నిర్మాతలు చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు సినిమా ఓకే అయ్యాకే హీరోలు డబ్బులు తీసుకుంటే నిర్మాతలకు మంచిదే.
