సంక్రాంతికి PSPK 27..
- sekhar
- Published On : February 28, 2021 / 04:28 PM IST
PSPK 27 – Sankranthi 2022: పవర్‌స్టార్ రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు.. అందుకు సంబంధించిన అప్‌డేట్లతో దర్శక నిర్మాతలు హంగామా చేస్తున్నారు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.. ఇటీవలే ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేసిన పవన్, కొద్దిరోజుల క్రితం వరకు రానాతో కలిసి నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూట్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం క్రిష్ సినిమా చిత్రీకరణలో ఉన్నారు.
పవన్ కళ్యాణ్, క్రిష్ కలయికలో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది అంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. పవన్ నటిస్తున్న 27వ సినిమా ఇది.
నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి ‘హరి హర వీరమల్లు’ అనే పేరు ఫిక్స్ చేశారని సమాచారం.. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
