Raghu Kunche : చేపల కంపులో రాత్రంతా పడుకున్నా.. ఎందుకొచ్చానురా బాబు అనిపించింది..
రఘు కుంచె మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. (Raghu Kunche)
Raghu Kunche
Raghu Kunche : మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె గత కొంతకాలంగా నటుడిగా మారి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. రఘు కుంచె మెయిన్ లీడ్ లో చైతన్య మోటూరు దర్శకత్వంలో తెరకెక్కిన గేదెల రాజు సినిమా ఏప్రిల్ 24న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రఘు కుంచె మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
Also Read : Riteish Deshmukh : స్టేజిపై ఏడ్చేసిన జెనీలియా, ఆమె భర్త.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎమోషనల్.. వీడియోలు వైరల్..
రఘు కుంచె మాట్లాడుతూ.. ఈ సినిమాకు మొదట సంగీత దర్శకుడిగానే తీసుకున్నారు. తర్వాత గేదెల రాజు పాత్ర చెప్పి చేయమనడంతో అది నచ్చి చేసాను. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. 12 కిలోల బరువు పెరిగాను ఈ పాత్ర కోసం. ఓ సారి యాక్షన్ సీక్వెన్స్ లో డూప్ కత్తులు మిస్ అయితే ఒరిజినల్ కత్తులు తీసుకొచ్చారు. అవి ఎక్కడ పొడుచుకుంటాయి అని భయంగా చేశాను ఆ సీన్.
కాకినాడ హార్బర్ లో కుళ్ళిన చేపల మధ్య ఆ కంపుని భరిస్తూ రాత్రంతా పడుకొని ఉన్న ఒక సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్ కి చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో అసలు ఎందుకు యాక్టింగ్ కి వచ్చానురా బాబు, హ్యాపీగా ఏసీలో కూర్చొని మ్యూజిక్ చేసుకోకుండా అని అనిపించింది. ఈ సినిమా కోసం మేకప్ లేకుండా సమ్మర్ లో కాకినాడలో రియాల్టీ కోసం చెమటలు కక్కుతూ సీన్స్ చేసాము. ఆర్టిస్టులు అలాంటి కష్టాలు చాలా పడతారు అని చెప్పుకొచ్చారు.
Also See : Mrunal Thakur : పూల పరిమళాల మధ్య మృణాల్ ఠాకూర్.. క్యూట్ ఫొటోలు..
