Varanasi : నాలుగు నెలల్లో వారణాసి.. పృథ్వీరాజ్ ఏమో అలా.. రాజమౌళి ఇలా.. నమ్మొచ్చా జక్కన్న..?
రాజమౌళి నెలల తరబడి షూటింగ్ చేస్తూనే ఉంటాడు. ప్రతి సీన్, షాట్ చెక్కుతూ ఉంటాడు. (Varanasi)
Varanasi
Varanasi : రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా 800 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది కానీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు ఆల్రెడీ. ఆ డేట్ కి వస్తుందని ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే ఇది రాజమౌళి సినిమా.
రాజమౌళి నెలల తరబడి షూటింగ్ చేస్తూనే ఉంటాడు. ప్రతి సీన్, షాట్ చెక్కుతూ ఉంటాడు. అందుకే జక్కన్న అనే బిరుదు కూడా ఇచ్చారు సినిమా వాళ్ళు. అయితే తాజాగా బాహుబలి ది టార్చ్ బేరర్ అనే డాక్యుమెంటరీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సిరీస్ లో రాజమౌళి బాహుబలి సినిమా గురించి మాట్లాడిన అనంతరం తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు.
Also Read : Rajamouli : వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టే.. హీరో హీరోయిన్స్ కూడా ఫిక్స్..
రాజమౌళి మాట్లాడుతూ.. వారణాసి షూటింగ్ లో మేజర్ పోర్షన్ పూర్తయింది. ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ లు అన్ని పూర్తయ్యాయి. ప్రస్తుతం చిన్న చిన్న సీన్స్, ఇంటర్ కనెక్టింగ్ సీన్స్ షూట్ చేస్తున్నాము. సెప్టెంబర్ లేదా, అక్టోబర్ కి నాలుగు నెలల్లో వారణాసి షూటింగ్ పూర్తవుతుంది అని తెలిపారు. దీంతో రాజమౌళి ఇంత తొందరగా షూటింగ్ పూర్తి చేస్తారా అని అంతా షాక్ అవుతున్నారు.
ఇటీవలే పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చాలా పర్ఫెక్ట్ మనిషి. ప్రతి షాట్ పర్ఫెక్ట్ గా రావాలి. ఒక సీన్ ని రోజంతా తీశారు. ఆల్మోస్ట్ 90 టేక్స్ తీసుకున్నారు ఆ రోజంతా అని అన్నారు. ఒక్క రోజులో కేవలం ఒక్క సీన్ తీశారంటే, ఇంత పర్ఫెక్షన్ కోసం పరితపిస్తున్నప్పుడు నాలుగు నెలల్లో వారణాసి షూట్ మొత్తం అయిపోతుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు సినిమా లవర్స్. ఒకవేళ షూటింగ్ పూర్తయినా ఈ సినిమాకు VFX వర్క్ చాలా ఎక్కువే ఉంది. దానికి చాలా టైం పట్టేస్తుంది. మరి రాజమౌళి చెప్పినట్టు నాలుగు నెలల్లో పూర్తి చేసి 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తారా లేక ఎప్పట్లాగే వాయిదా వేస్తారా చూడాలి.
