×
Ad

Varanasi: రెండు పార్టులుగా వారణాసి.. పోస్టర్ లో హింట్ ఇచ్చిన జక్కన్న.. ఇది గమనించారా?

వారణాసి(Varanasi) సీక్వెల్ గురించి రిలీజ్ డేట్ పోస్టర్ లో చిన్న హింట్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి.

Rajamouli Varanasi movie releasing in two parts.

  • వారణాసి కి సీక్వెల్ ఉండనుందా?
  • రిలీజ్ డేట్ పోస్టర్ లో చిన్న హింట్ ఇచ్చిన జక్కన్న
  • నెటిజన్స్ లో కొత్త చర్చకు దారితీసిన రాజమౌళి

Varanasi: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి(Varanasi). సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నాడు. యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి టైటిల్ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోకి ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాను 2027లో విడుదల చేస్తున్నట్టు అదే సమయంలో ప్రకటించారు. తాజాగా వారణాసి సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలాడు జక్కన్న. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

Aishwarya Rajesh: చీరలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య.. ఎంత అందంగా ఉందో కదా.. ఫొటోలు

అయితే, రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల అయ్యాక ఆడియన్స్ లో ఒక కొత్త సందేహం మొదలయ్యింది. అదేంటంటే, రాజమౌళి వారణాసి సినిమాను రెండు పార్టులుగా తీస్తున్నాడా అని. కారణం ఏంటంటే, టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన పోస్టర్ లో వారణాసి సినిమాను గ్లొబ్ ట్రాటర్ అండ్ టైం ట్రాటర్ అనే రెండు యాష్ ట్యాగ్స్ ని యాడ్ చేశాడు. కానీ, తాజాగా విడుదలైన పోస్టర్ లో మాత్రం కేవలం గ్లొబ్ ట్రాటర్ అని మాత్రమే కనిపించింది. దీంతో, వారణాసి పార్ట్ 1లో ప్రపంచాన్ని చుట్టేసి వీరుడిగా కనిపించే మహేష్ బాబు వారణాసి పార్టీ 2లో కాలాల్ని చుట్టేసే ధీరుడిగా కనిపిస్తాడని టాక్ నడుస్తోంది.

ఇదే గనక నిజమైతే వారణాసి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. అయితే, పోస్టర్ లో కావాలని ప్రేక్షకులకు పజిల్ గా ఉండేలా సెకండ్ పార్ట్ కి హింట్ ఇస్తూ జక్కన్న ఇలా ప్లాన్ చేశాడు అంటూ నెట్టింట టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా వారణాసి సినిమా రెండు పార్టులుగా రావడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది అధికారిక ప్రకటన వచ్చాకే తెలుస్తుంది.