రియల్ సూపర్ స్టార్..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, తెర మీదే కాదు, తెర ముందూ హీరో అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన వ్యక్తిత్వమే ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా లక్షాలాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. రీసెంట్‌గా రజినీ తన అభిమాని కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం చేసాడు. వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని ధర్మపురి జిల్లాకి చెందిన మహేంద్రన్, ఆ జిల్లా రజినీ మక్కల్ మండ్రం కార్యదర్శి. ఇటీవలే మహేంద్రన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని కుటుంబానికి సంతాపం తెలిపిన రజినీ, ఆ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకుంటానని గతంలోనే చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం, మహేంద్రన్ కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకుని, రజినీ మక్కల్ మండ్రం తరపున రూ.40 లక్షలు, తన వంతుగా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందచేసారు.
అలాగే, తాకట్టులో ఉన్న మహేంద్రన్ ఇంటిని విడిపించి, ఇంటి తాలూకూ పేపర్స్‌ని మహేంద్రన్ భార్యకు అందించాడు. మహేంద్రన్ పిల్ల చదువులకయ్యే ఖర్చుని కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చాడు రజినీకాంత్.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రజినీ రియల్ సూపర్ స్టార్ అని అభిమానులు పొగుడుతున్నారు. పేట తర్వాత రజినీ మురుగదాస్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నాడు.