man vs wild షో లో సూపర్ స్టార్ రజనీకాంత్!

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో లో పాల్గొనబోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్..

  • Publish Date - January 28, 2020 / 09:38 AM IST

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో లో పాల్గొనబోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్..

డిస్కవరీ ఛానెల్‌లో టెలికాస్ట్ అయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ ఎంత పాపులరో తెలిసిందే. ఈసారి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ షోలో పార్టిసిపెట్ చేయనున్నారు. ఈ షోని  మొత్తం హోస్ట్ చేసే బేర్ గ్రిల్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. పర్యావరణ సంరక్షణ అనే కాన్సెప్ట్‌తో ఈ షోని నడిపిస్తుంటాడు గ్రిల్స్.

ఇటీవల ప్రధాని మోదీ కూడా బేర్‌ గ్రిల్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ప్రధాని, గ్రిల్స్.. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్‌లో సాహసయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 180 దేశాల్లో మోదీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. తాజాగా రజనీకాంత్ కూడా గ్రిల్స్‌తో ఈ సాహసయాత్రలో భాగం కానున్నారు.

Read Also : ఈ సమ్మర్ ఫుల్ ప్యాక్ – పదికి పైగా సినిమాలు!

కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ అండ్ నేషనల్ పార్క్ అటవీప్రాంతంలో రజనీతో కలిసి, గ్రిల్స్ ఈ షోని షూట్ చేయనున్నారు. జనవరి 28 నుండి 30 వరకు ఈ షూటింగ్ జరుగనుంది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు