Operation Padma : ‘ఆపరేషన్ పద్మ’ మూవీ రివ్యూ..
ఆపరేషన్ పద్మ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లో రిలీజయింది.(Operation Padma)
Operation Padma
Operation Padma : నరేష్ మేడి, రజిత శాండీ, రణధీర్ బీసు, KT మల్లిఖార్జున, రఘుపతి రెడ్డి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఆపరేషన్ పద్మ. ఘట్టమనేని అరవింద్ బాబు, రాఘవ మండలపు, రాంబాబు మండలపు నిర్మాణంలో కార్తికేయ వి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆపరేషన్ పద్మ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. మాజీ హోం మంత్రి నంది కిషోర్ పౌర సరఫరా శాఖలో జరిగిన భారీ కుంభకోణాన్ని బయట పెట్టడంతో సంచలనం నెలకొంటుంది. ఆ కుంభకోణాన్ని బయటపెట్టడంతో ప్రజల్లో మంచి పేరుని తెచ్చుకోగా కొంతమందికి మాత్రం టార్గెట్గా మారతాడు. దీంతో నంది కిషోర్ శత్రువులు అతనిని చంపడానికి కిల్లర్ కుల్దీప్(రణధీర్ బిసు) ను నియమిస్తారు. దీంతో అతన్ని కాపాడటానికి, ఆ కుంభకోణం కోసం ఆపరేషన్ పద్మ అని అవంతిక(రజిత శాండీ) నేతృత్వంలో ఓ టీంని ఏర్పాటు చేస్తారు. మరి అవంతిక, ఆమె టీమ్ మెంబర్స్ ఆ కిల్లర్ ని పట్టుకున్నారా? ఈ టీమ్ ఏం చేసింది? ఆపరేషన్ పద్మ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Operation Padma
సినిమా విశ్లేషణ.. పొలిటికల్ క్రైమ్ నేపథ్యంలో రెగ్యులర్ గా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ ఆపరేషన్ పద్మ కూడా అలాంటిదే. ఫస్ట్ హాఫ్ అంతా పొలిటికల్ గా, రాజకీయ నాయకులు చేసే కుంభకోణాలు, వాళ్ళ సీక్రెట్ వ్యవహారాలతో సాగుతుంది. నంది కిషోర్ ని చంపడానికి కిల్లర్ ని నియమించిన దగ్గర్నుంచి కథ కాస్త ఆసక్తిగా నడుస్తుంది. కిల్లర్, ఆపరేషన్ పద్మ టీమ్ మధ్య సీన్స్ ఎత్తుకు పైఎత్తు అన్నట్టు ఉంటాయి. అసలు ఏం జరిగింది అని కనిపెట్టడానికి కాస్త పరిశోధనాత్మకంగా రాసుకున్న సీన్స్ బాగానే ఉంటాయి. అక్కడక్కడా థ్రిల్లింగ్ అంశాలు మెప్పిస్తాయి. క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ తో సింపుల్ గానే ముగించారు.
Also Read : Meher Ramesh : ప్రభాస్ దర్శకుడి ఇంట్లో విషాదం.. మా అమ్మని తనలో చూసుకున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్..
నటీనటుల పర్ఫార్మెన్స్.. రణధీర్ బీసు కిల్లర్ పాత్రలో స్టైలిష్ పర్ఫామెన్స్తో బాగానే మెప్పించాడు. రజిత శాండీ పవర్ ఫుల్ పాత్రలో మెప్పించింది. రఘుపతి రెడ్డి, నరేష్ మేడి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. ఈ సినిమాలోని ఉమెన్ కారెక్టర్స్ అన్నీ కూడా అవసర్లేకపోయినా కాస్త బోల్డ్ గానే చూపించారు.
సాంకేతిక అంశాలు.. ఈ సినిమా సాంకేతికంగా ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్లేదు అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. కిల్లర్ వర్సెస్ ఆపరేషన్ టీమ్ అని మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్, కథ తీసుకున్నా దాన్ని ప్రజెంట్ చేసే విధానాన్ని ఇంకాస్త క్లారిటీగా రాసుకోవాల్సింది. ఎడిటింగ్ లో కొన్ని చోట్ల ల్యాగ్ సీన్స్ కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చుపెట్టారు.
Also Read : Honey Review : ‘హనీ’ మూవీ రివ్యూ.. క్షుద్ర పూజలతో హారర్ థ్రిల్లర్..
మొత్తంగా ఆపరేషన్ పద్మ ఓ కిల్లర్ ని చంపడానికి సాగే యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
