Rajmouli : మాకు నమ్మకం లేదు దొర.. రాజమౌళి మహేష్ బాబు సినిమాపై ఫ్యాన్స్ కూడా..
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. (Rajmouli)
Rajmouli
Rajmouli : రాజమౌళి సినిమా అనౌన్స్ చేసినప్పుడే అటూ ఇటుగా రిలీజ్ మీద హింట్ ఇస్తారు. వారణాసి విషయంలో ఏకంగా సంవత్సరం ముందే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. 7 ఏప్రిల్ 2027 రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించేసారు. దీనికితోడు చాలా వరకు షూటింగ్ అయిపోతోందని చెబుతునే ఉన్నారు రాజమౌళి. 12 ఏళ్లనుంచి ఏ సినిమానీ ఇచ్చినడేట్ ప్రకారం రిలీజ్ చెయ్యని రాజమౌళిని జనాలు ఈసారైనా నమ్ముతారా..? ఇచ్చిన డేట్ కే వారణాసి రిలీజవుతుందా అనే చర్చ జరుగుతుంది.
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేకాదు మరో 2 నెలల్లో మొత్తం షూటింగ్ అయిపోతుందని క్లారిటీ కూడా ఇచ్చారు రాజమౌళి. ఇంత పక్కాగా రిలీజ్ కి 6,7 నెలల ముందే షూటింగ్ కంప్లీట్ అయిపోతోందని చెప్పడం, అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్స్, సీజీ వర్క్ చేస్తుండడంతో సినిమా పక్కాగా చెప్పిన డేట్ కే వస్తుందని అంటున్నారు. కానీ రాజమౌళి ట్రాక్ రికార్డ్ మాత్రం అలా లేదు.
Also See : Geetha Madhuri : తిరుమలలో ఫ్యామిలీతో కలిసి సందడి చేసిన సింగర్ గీతామాధురి.. ఫొటోలు..
ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ డేట్ ఇచ్చింది. దాన్ని అందుకోవడానికి సూపర్ ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా కూడా ఇండియాలోనే ఉంది. లేటెస్ట్ గా 250 డేస్ కౌంట్ డౌన్ కూడా ఇచ్చారు. కానీ ఫాన్స్ మాత్రం ఇంకా డౌట్స్ లోనే ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి ట్రాక్ రికార్డ్ మాత్రం ఇచ్చిన డేట్ కి సినిమా రిలీజ్ చేసినట్టు చూపించడం లేదు. 2005 నుంచి ఇప్పటి వరకూ రాజమౌళి చేసిన ఏ సినిమా ఫస్ట్ ఇచ్చిన రిలీజ్ డేట్ కి థియేటర్లోకి రాలేదు. దాంతో రాజమౌళి అంటే అయినట్టేనా, అసలు సినిమా థియేటర్లోకొచ్చినప్పుడు చూద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్.
ఫ్యాన్స్ కి సినిమాపై అంచనాలు ఉన్నా రిలీజ్ డేట్ పై అనుమానాలు ఉన్నాయి. ఈగ, బాహుబలి, బాహుబలి 2, ట్రిపుల్ ఆర్ ఈ సినిమాలన్నీ కనీసం 2,3 సార్లు వాయిదా పడిన సినిమాలే. దాంతో 250 డేస్ టు రిలీజ్ అని కౌంట్ డౌన్ ఇచ్చినా, ఈ సారి ఎట్టి పరిస్తితుల్లో ఏప్రిల్ 7న థియటర్లోకొస్తుందని చెప్పినా జనాలు మాత్రం ఎక్కడో కొడుతుంది భయ్యా అనుకుంటున్నారు. మహేశ్ బాబు మాములు లుక్ తో పాటు, రాముడిగా కూడా కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. మరి రాజమౌళి హాలీవుడ్ టార్గెట్ గా పెట్టుకొని తీస్తున్న ఈ సినిమా హాలీవుడ్ కోసం అయినా చెప్పినా డేట్ కి రిలీజ్ చేస్తారా చూడాలి.
Also See : Allu Family : స్పైడర్ మ్యాన్ షోలో సందడి చేసిన అల్లు ఫ్యామిలీ.. ఫొటోలు..
