Massa Massa Song: మోస్ట్ అవైటెడ్.. పెద్ది ‘మస్సా.. మస్సా’ సాంగ్ వచ్చేసింది.. ఇక్కడ వినేయండి
రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి మస్సా మస్సా సాంగ్(Massa Massa Song) ను మేకర్స్ విడుదల చేశారు.
ram charan peddi massa massa song released
Massa Massa Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది.
Ram Charan: స్వయంగా మోదీ అడిగారు.. ‘పెద్ది’ మూవీ వికసిత్ భారత్ అని చెప్పాను: రామ్ చరణ్
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్‌తో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్లోనే ‘పెద్ది’ సినిమా నుండి మోస్ట్ అవేటెడ్ ‘మస్సా మస్సా(Massa Massa Song)’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎంతో ఇన్స్పిరేషనల్ లిరిక్స్‌తో సాగే ఈ పాట ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ సాంగ్‌కు సోషల్ మీడియాలో క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఇది చార్ట్‌బస్టర్‌గా నిలిచి మోస్ట్ సెలబ్రేటెడ్ సాంగ్ కానుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ పాటపై ఫ్యాన్స్ నుండి ఒక ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఈ ‘మస్సా మస్సా’ సాంగ్ మాతృభాష తెలుగు కంటే.. హిందీ వర్షన్‌లోనే వినడానికి చాలా బాగుందంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ పాటతో ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్ట్స్ లెవెల్‌కు చేరుకున్నాయి.
