Peddi OTT : ‘పెద్ది’ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుంది..?
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. (Peddi OTT)
Peddi OTT
Peddi OTT : రామ్ చరణ్ పెద్ది సినిమా నేడు థియేటర్స్ లో రిలీజయింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. థియేటర్స్ చాన్నాళ్ల తర్వాత కళకళలాడుతున్నాయి. ఇక చరణ్ పర్ఫార్మెన్స్ ని అందరూ పొగుడుతున్నారు. సెకండ్ హాఫ్ అయితే ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టిస్తున్నారు.
పెద్ది సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ లో నడుస్తుంది. ఇటీవల ముందే ఒప్పందాలు చేసుకోవడంతో థియేటర్లో సినిమాతో పాటే ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ ని కూడా అనౌన్స్ చేసేస్తున్నారు. పెద్ది సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు ప్రకటించారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ పెద్ది సినిమాను దాదాపు 130 కోట్లకు కొనుక్కున్నట్టు సమాచారం.
Also Read : Ram Charan : ఇన్నాళ్లు తమిళ్ హీరోలని పొగిడారు.. ఇప్పుడు చరణ్ ని పొగుడుతారా? మన స్టార్ హీరోలకు ఆ దమ్ముందా?
థియేటర్లు బాగుపడాలంటే ఓటీటీలో పెద్ద సినిమాలు 8 వారాల తర్వాతే రిలీజ్ అవ్వాలని అందరూ అంటున్నా ఓటీటీ ఒప్పందాలతో ముందే వచ్చేస్తున్నాయి. ఇటీవల ఎంత పెద్ది సినిమా అయినా, హిట్ సినిమా అయినా 4 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ లెక్కన పెద్ది సినిమా జులై మొదటి వారంలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు.
