Peddi: రిలీజ్ కి ముందే ‘పెద్ది’ రికార్డుల మోత.. అమెరికాలో ‘రామ్ చరణ్’ మాస్ ర్యాంపేజ్
విడుదలకు ముందే రికార్డ్ లెవల్లో కలెక్షన్స్ సాధిస్తున్న రామ్ చరణ్ పెద్ది(Peddi) మూవీ.
Ram Charan peddi record breaking half million collections at USA before release.
- రామ్ చరణ్ పెద్ది ఓవర్సీస్ ర్యాంపేజ్
- రిలీజ్‌కు ముందే హాఫ్ మిలియన్ రికార్డు
- జూన్ 4న బాక్సాఫీస్ వద్ద పూనకాలు
Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది(Peddi)’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో.. ఓవర్సీస్ మార్కెట్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా అందుతున్న ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే 500K (హాఫ్ మిలియన్ డాలర్లు) మార్కును దాటేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే కేవలం ప్రీమియర్ల ద్వారానే వన్ మిలియన్ డాలర్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సాంగ్స్ అన్నీ ఇప్పటికే చార్ట్బస్టర్లుగా నిలిచి సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా శృతి హాసన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ‘హాళ్లళ్లల్లో’ మాస్ ఐటెం సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతూ థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు రెడీగా ఉంది.
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రామ్ చరణ్ రస్టిక్ మాస్ లుక్, బుచ్చిబాబు మార్క్ ఎమోషనల్ టేకింగ్ అమెరికా ఆడియన్స్‌ను థియేటర్లకు పరుగులు పెట్టిస్తున్నాయి. ఓవర్సీస్ బాక్సాఫీస్ వేటను అప్పుడే షురూ చేసిన ‘పెద్ది’ చిత్రం, రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను తిరగరాయబోతుందో చూడాలి.
