RC 17 : నేడే ఓపెనింగ్.. RC17 రిలీజ్ ఎప్పుడంటే.. మెగా ఫ్యాన్స్ ఎన్నాళ్ళు ఎదురు చూడాలి..?
పెద్ది తర్వాత చరణ్ మళ్ళీ ఎప్పుడు థియేటర్ లో కనిపిస్తాడని ఎదురు చూస్తున్నారు. (RC 17)
RC 17
RC 17 : మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న RC17 సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. రంగస్థలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు చిరంజీవి గెస్ట్ గా ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్, కొత్త తెలుగమ్మాయి పేర్లు వినిపిస్తున్నా అధికారికంగా ఎవర్నీ ప్రకటించలేదు.
Also Read : RC 17 : ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. నెమలి పింఛంతో రామ్ చరణ్.. సుక్కు బ్యాక్ టు లవ్ స్టోరీ..?
పెద్ది తర్వాత చరణ్ మళ్ళీ ఎప్పుడు థియేటర్ లో కనిపిస్తాడని ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 తర్వాత నుంచి ఖాళీగా ఉన్న సుకుమార్ ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్, లొకేషన్స్ కూడా కొన్ని ఫైనల్ చేసారని సమాచారం. నేడు ఈ సినిమా ఓపెనింగ్ జరగ్గా జనవరిలో సంక్రాంతి తర్వాత నుంచి షూటింగ్ మొదలవుతుందని సమాచారం. 2027 లో షూటింగ్ పూర్తి చేసి 2028 మొదట్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి 2028 సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు.
మరి అనుకున్నట్టే 2028 సమ్మర్ కి RC17 సినిమా వస్తుందా లేదా చూడాలి. ఇక నేడు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ తో RC17 సినిమా యాక్షన్, లవ్ స్టోరీ అని తెలుస్తుంది.
