Ram Charan Upasana : చరణ్ భార్య పాదాలను పట్టుకొని.. ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్యకు దాసుడే.. క్యూట్ వీడియో వైరల్..

అనంత్ అంబానీ - రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి చరణ్ - ఉపాసన కూడా వెళ్లారు. చరణ్, ఉపాసన ఓ ప్రైవేట్ జెట్ లో వెళ్లారు.

Ram Charan Upasana : చరణ్ భార్య పాదాలను పట్టుకొని.. ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్యకు దాసుడే.. క్యూట్ వీడియో వైరల్..

Ram Charan Upasana Cute Video in Flight goes Viral

Ram Charan Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనల మధ్య భార్యాభర్తల బంధం ఎంత క్యూట్ గా ఉంటుందో ఇప్పటికే అనేక సార్లు చూపించారు. తాజాగా చరణ్, ఉపాసనల వీడియో ఒకటి వైరల్ అవుతుంది. నిన్న గుజరాత్ లో జరిగిన అనంత్ అంబానీ – రాధికా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి చరణ్ – ఉపాసన కూడా వెళ్లారు. చరణ్, ఉపాసన ఓ ప్రైవేట్ జెట్ లో వెళ్లారు.

Also Read : Nayanthara Vignesh Shivan : ఆ స్టేటస్ పెట్టి.. భర్తని అన్ ఫాలో చేసిన నయనతార.. ఏమైంది అంటూ ఫ్యాన్స్ కంగారు..

అయితే నిన్న చరణ్ ఉపాసన ఫ్లైట్ లో వెళ్తుండగా ఉపాసన కాళ్ళు నొప్పెట్టాయేమో, ఉపాసన తన కాళ్ళని రామ్ చరణ్ మీద పెట్టగా చరణ్ ఉపాసన పాదాల్ని ఒత్తుతూ, మసాజ్ చేస్తూ ఉపాసన రిలాక్స్ అయ్యేలా చేసాడు. ఈ క్యూట్ వీడియోని ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ ఎంత స్టార్ హీరో అయినా భార్యకు దాసుడే అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. క్యూట్ కపుల్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.