‘రాములో రాములా’ ఫుల్ సాంగ్ : ధూమ్ ధామ్

దీపావళి కానుకగా ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి ‘రాములో రాములా’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు..

  • Publish Date - October 26, 2019 / 12:32 PM IST

దీపావళి కానుకగా ‘అల వైకుంఠపురములో’ సినిమా నుంచి ‘రాములో రాములా’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల వైకుంఠపురములో’.. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్స్.. టబు, రాజేంద్రప్రసాద్, జయరామ్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, నవదీప్, సుశాంత్,వెన్నెల కిశోర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ‘రాములో రాములా’ సాంగ్ టీజర్ రిలీజ్ చేయగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

దీపావళి కానుకగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘రాములో రాములా.. నన్నాగంజేసిందిరో.. ‘రాములో రాములా.. నా పాణం తీసిందిరో.. అనే సాంగ్ లిరికల్‌గానూ, విజువల్‌గానూ ఇరగదీసింది. థమన్ ట్యూన్, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి, సత్యవతి (మంగ్లీ) పాడారు. భారీ సెట్‌లో పిక్చరైజ్ చేసిన ఈ పాటలో హీరోయిన్స్‌తో సహా సినిమాలోని ఇతర తారాగణమంతా కనిపించారు.

Read Also : జనవరి 15న ‘ఎంత మంచివాడవురా’

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. థమన్ మాస్ బీట్‌కి బన్నీ తన మార్క్ స్టెప్స్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేయడం పక్కా అనిపిస్తోంది.  గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.