Ramya Krishnan : శివగామి బర్త్‌డే సెలబ్రేషన్స్.. స్టార్స్ అంతా ఒకే చోట..

సీనియర్ నటి రమ్యకృష్ణ తోటి స్టార్స్‌తో కలిసి తన 51వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు..

Ramya Krishnan : ‘క్వీన్ ఆఫ్ తెలుగు సినిమా..సిల్వర్ స్క్రీన్ శివగామి’ రమ్యకృష్ణ సెప్టెంబర్ 15న తన 51వ పుట్టినరోజు జరుపుకున్నారు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి తన టైంలో స్టార్ హీరోయిన్స్‌గా రాణించిన ఖుష్బూ, మధుబాలతో పాటు తర్వాతి జెనరేషన్ స్టార్ త్రిష, బృంద మాస్టర్ తదితరులు అటెండ్ అయ్యి సందడి చేశారు.

ఈ ఫొటోలను ఖుష్బూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చెయ్యగా వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’, పూరి డైరెక్ట్ చేస్తున్న ‘లైగర్’, సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’, నాగార్జునతో ‘బంగార్రాజు’ సినిమాలు చేస్తున్నారు రమ్యకృష్ణ.

కరోనా వల్ల అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్‌లో తప్ప స్టార్స్ కలవడం కుదరలేదు. పైగా ఇలాంటి పార్టీలు చేసుకుని చాలా రోజులైంది. ఈమధ్య సీనియర్ నటి, ఎంపీ సుమలత తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ వచ్చారు. అలాగే సుహాసిని మణిరత్నం బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి కమల్ హాసన్, రమ్యకృష్ణ, ఖుష్బూతో పాటు ఫ్రెండ్స్, రిలేటివ్స్ సందడి చేశారు.

ట్రెండింగ్ వార్తలు