Ramayana : రెండు వారాల ముందే ‘రామాయణ’ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు? ఎక్కడ?
నేడు ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ని ప్రకటించారు. (Ramayana)
Ramayana
Ramayana : రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా బాలీవుడ్ లో రామాయణంపై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో నితీష్ తివారి దర్శకత్వంలో ‘రామాయణ’ పేరుతో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో డినెగ్ లాంటి హాలీవుడ్ సంస్థలతో కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ట్రైలర్, పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఈ దీపావళికి పార్ట్ 1 వచ్చే దీపావళికి పార్ట్ 2 రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించారు. రామాయణ పార్ట్ 1 నవంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ని ప్రకటించారు.
Also Read : Hyderabad : బ్రేకప్ తర్వాత.. హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న స్టార్ హీరోయిన్..
రామాయణ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 19న హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో సాయంత్రం 5 గంటల నుంచి జరగనుంది. ఈ ఈవెంట్ కి రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, దర్శక నిర్మాతలు రానున్నారు. టాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరో గెస్ట్ గా వస్తాడని సమాచారం. అయితే సినిమా రిలీజ్ కి ఏకంగా 17 రోజుల ముందే తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండటం, అది కూడా దసరా పండగ ముందు రోజు చేస్తుండటంతో ఆశ్చర్యపోతున్నారు.

