పాపులర్ యాంకర్ రష్మీ గౌతమ్ కొత్త మూవీ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’లో నటిస్తోంది. ఇప్పుడు ఆ మూవీకి సంబంధించి కొత్త లుక్ షేర్ చేసింది.. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రష్మీ తన మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ తన అభిమానులతో పంచుకుంది.
https://10tv.in/akhil-akkineni-to-team-up-with-director-surender-reddy/
ఇందులో నటుడు నందు, రష్మీ గౌతమ్ జంటగా నటిస్తున్నారు. రష్మీ ఫస్ట్ లుక్కు ప్రేక్షకుల నుంచి కూడా ఫుల్ రెస్పాన్ వస్తోంది. అంతేకాదు.. ఈ మూవీలో తన క్యారెక్టర్ పేరు కూడా చెప్పేసింది రష్మీ.. పోతురాజు గాడి లవర్ వాణిగా కనిపించబోతున్నాని చెప్పింది.
ఫస్ట్ లుక్ పోస్టర్లో రష్మీ తలపై కిరీటం పెట్టుకుని నవ్వుతూ కనిపించింది. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు, ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు.. రియల్లీ ఈ బొమ్మ బ్లాక్బస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నందు పోతురాజు పాత్రలో నటిస్తున్నాడంట.. పోతురాజుకు రష్మీ లవర్ గా నటిస్తుందంట..
#Vaani pic.twitter.com/H6VqYQhKmP
— rashmi gautam (@rashmigautam27) September 9, 2020