Rashmika Mandanna Sister : రష్మికకు ఇంత క్యూట్ చిన్ని చెల్లి ఉందని తెలుసా? ఏకంగా 16 ఏళ్ళు గ్యాప్..
ఇటీవల రాఖీ పండగ రోజున తన చెల్లితో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక.

Rashmika Mandanna Sister Shiman Mandanna Photos goes Viral after Rashmika Rakhi Post
Rashmika Mandanna Sister : మన సెలబ్రిటీల పిల్లలు, సోదరీసోదరీమణుల ఫోటోలు బయటకు వస్తే వైరల్ అవ్వాల్సిందే. తాజాగా రష్మిక చెల్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చాలా మందికి రష్మికకు ఒక చిన్ని చెల్లి ఉందని తెలీదు. రష్మిక గతంలో పలుమార్లు తన చిన్ని చెల్లితో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇటీవల రాఖీ పండగ రోజున తన చెల్లితో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : Kiran Abbavaram – Rahasya Gorak : పెళ్లికొడుకుగా కిరణ్.. పెళ్లికూతురిగా రహస్య.. రేపే పెళ్లి..
రష్మిక చెల్లి పేరు షీమన్ మందాన. రష్మికకు, షీమన్ కు మధ్య ఏకంగా 16 ఏళ్ళ గ్యాప్ ఉంది. రష్మిక ఎక్కడా తన చెల్లి గురించి ఎక్కువగా మాట్లాడదు. అయితే గతంలో ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో రష్మిక తన చెల్లి గురించి మాట్లాడుతూ.. తనంటే ఇష్టమని, తన చిన్నప్పుడు డ్రెస్ వేయడం, డైపర్ మార్చడం.. ఇలా అన్ని పనులు చేసానని, కానీ షూటింగ్స్ బిజీ వల్ల తనకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను అని తెలిపింది.
మళ్ళీ ఇన్నాళ్లకు రాఖీ రోజున తన చెల్లి షీమన్ తో దిగిన ఫోటోలు రష్మిక షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో రష్మిక చెల్లి మరోసారి వైరల్ అవుతుంది. దీంతో రష్మికకు ఇంత చిన్ని చెల్లి ఉందా అని ఆశ్చర్యపోతూ భలే క్యూట్ గా ఉంది షీమన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.